Home > క్రీడలు > WTC ఫైనల్...కోహ్లీ, పుజారాలను అవుట్ చేసేందుకు బాల్ టాంపరింగ్.. ?

WTC ఫైనల్...కోహ్లీ, పుజారాలను అవుట్ చేసేందుకు బాల్ టాంపరింగ్.. ?

WTC ఫైనల్...కోహ్లీ, పుజారాలను అవుట్ చేసేందుకు బాల్ టాంపరింగ్.. ?
X

WTC ఫైనల్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ కలకలం రేగింది. భారత బ్యాటర్లను ఆస్ట్రేలియా బౌలర్స్ ఔట్ చేసేందుకు బాల్ టాంపరింగ్ పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్ టాంపరింగ్ తర్వాత కోహ్లీ, పుజారాలు ఔట్ అయ్యారంటూ పాక్ మాజీ ఆటాగాడు బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశాడు. కోహ్లీ, పుజారాలు నిష్క్రమించిన సమయంలో బంతి ఆకారం మారిదంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వివరించాడు. ఆసీస్ ఆటగాళ్లు బంతి ఆకారం మార్చడం టీవీల్లో స్పష్టంగా కనబడుతోందని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అంపైర్లు, కామెంటరీ బాక్స్ లో ఉన్నవారు గమనించలేకపోయారన్నాడు. 16, 18వ ఓవర్లలో బాల్ టాంపరింగ్ జరిగిందన చెప్పేందుకు బలమైన ఆధారాలున్నాయని బాసిత్ అలీ స్పష్టం చేశాడు. 18వ ఓవర్ సమయంలో బంతి ఆకారం దెబ్బతిన్నదంటూ మరో బంతిని తీసుకున్నారని వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో పుజారా 14వ ఓవర్ లో అవుట్ కాగా, కోహ్లీ 19వ ఓవర్ లోనే అవుటవ్వడం గమనార్హం. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మ్యాచ్ విషయానికి కొస్తే ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 296 పరులు చేసి పూర్తి వికెట్లు చేజార్చుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు మొదటి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్‌ను మూడో రోజు రహానె (89), శార్దూల్ ఠాకూర్(51) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్ 3, స్టార్ట్క్, బోలాండ్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. లియాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.

Updated : 9 Jun 2023 8:12 PM IST
Tags:    
Next Story
Share it
Top