Home > క్రీడలు > జైశ్వాల్ బజ్బాల్ ఇన్నింగ్స్.. తొలిరోజు భారత్దే ఆధిపత్యం

జైశ్వాల్ బజ్బాల్ ఇన్నింగ్స్.. తొలిరోజు భారత్దే ఆధిపత్యం

జైశ్వాల్ బజ్బాల్ ఇన్నింగ్స్.. తొలిరోజు భారత్దే ఆధిపత్యం
X

ఐదు టెస్ట్ మ్యాచుల్లో భాగంగా.. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగిస్తుంది. తొలిరోజు ఇంగ్లాండ్ పై ఆధిపత్యం పదర్శించింది. తొలుత బౌలర్లు దెబ్బ కొట్టగా.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మన ఆటగాళ్లు ఇంగ్లాండ్ కు బజ్ బాల్ రుచి చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత స్పిన్ ఉచ్చులో ఇరుక్కుపోయింది. స్పిన్ కు అనుకూలించే ఉప్పల్ పిచ్ పై టీమిండియా స్పిన్నర్లు రెచ్చిపోయారు. దీంతో టీ బ్రేక్ లోపే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (20), డకెట్ (35) శుభారంభం అందించలేకపోయారు.

బెన్ స్టోక్స్ కెప్టెన్ ఇన్నింగ్స్:

తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ క్రీజులో నిలబడలేకపోయారు. ఒల్లీ పోప్ (1) నిరాశ పరిచాడు. రూట్ (29), బెయిర్ స్టో (37) కుదురుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివర్లో బెన్ స్టోక్స్ (70) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో రెహాన్ అహ్మాద్ (13), టోమ్ హార్ట్లే (23), మార్క్ ఉడ్ (11) కొన్ని పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 65 ఓవర్లకు 243 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడూ వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, బుమ్రా తలా రెండు వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ ను కుప్పకూల్చారు.

ఇంగ్లాండ్కు బజ్బాల్ రుచి:

అనంతరం తొలి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన భారత్.. ఇంగ్లాండ్ కే బజ్ బాల్ రుచి చూపించింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (76 నాటౌట్), రోహిత్ శర్మ (24) దాటిగా ఆడారు. మొదటి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై దూకుడుగా ఆడారు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ అదరగొట్టాడు. అతనికి రోహిత్ శర్మ సహకరించాడు. దీంతో కేవలం 47 బంతుల్లోనే జైశ్వాల్ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా 12.2 ఓవర్ వద్ద భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. దీంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. మూడో వికెట్ లో వచ్చిన శుభ్ మన్ గిల్ (14, 43 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో ఇవాళ ఆట ముగిసేసరికి భారత్ 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.



Updated : 25 Jan 2024 12:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top