Home > క్రీడలు > సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. చూసి నేర్చుకోండంటూ బ్యాటర్లపై ట్రోల్స్

సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. చూసి నేర్చుకోండంటూ బ్యాటర్లపై ట్రోల్స్

సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. చూసి నేర్చుకోండంటూ బ్యాటర్లపై ట్రోల్స్
X

విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో మొదటి రోజు టీమిండియా ఇంగ్లాండ్ పై పైచేయి సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి టెస్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించింది. కఠినంగా మారిన విశాఖ పిచ్ పై ఆచితూచి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. మొదటి టెస్ట్ ‘జైస్వాల్ బాల్’ రుచి చూపించిన యశస్వీ.. ఈ మ్యాచ్ లో చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. 198 బంతులు ఎదుర్కున్న జైస్వాల్ 135 పరుగులు (నాటౌట్) చేశాడు. అందులో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తుంది.

ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ లో 41 బంతులు ఎదుర్కున్న రోహిత్.. 14 పరుగులు చేశాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు. తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ (34) పరవాలేదనిపించినా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ (27) అదే తీరుగా వికెట్ పారేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ కు తొలిరోజు మూడు కీలక వికెట్లు దక్కాయి. నాలుగో వికెట్లో వచ్చిన డెబ్యూట్ ప్లేయర్ రజత్ పటిదార్ (29 నాటౌట్) క్రీజులో కుదురుకున్నాడు. జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, టామ్ హార్ట్లీ, బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా జైస్వాల్ ఇన్నింగ్స్ పై భారత అభిమానులతో సహా, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మిగతా క్రికెటర్లను ట్రోలింగ్ చేస్తున్నారు. కుర్రాడిని చూసి నేర్చుకోండని కామెంట్ చేస్తున్నారు.


Updated : 2 Feb 2024 10:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top