Home > క్రీడలు > గాడితప్పిన టీమిండియా.. ఇంగ్లాండ్ పట్టుకు చిక్కని యశస్వీ జైస్వాల్

గాడితప్పిన టీమిండియా.. ఇంగ్లాండ్ పట్టుకు చిక్కని యశస్వీ జైస్వాల్

గాడితప్పిన టీమిండియా.. ఇంగ్లాండ్ పట్టుకు చిక్కని యశస్వీ జైస్వాల్
X

అతనో అద్భుతం. టీమిండియా భవిష్యత్తు. మేటి ఆటగాళ్ల సరసన చేరతాడు... ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మాజీలు, క్రికెట్ అభిమానులు యశస్వీ జైస్వాల్ ను అన్నమాటలివి. ఒకపక్క తోటి ఆటగాళ్లంతా క్యూ కట్టి పెవిలియన్ చేరుతుంటే.. క్రీజులో ఒక్కడై నిలబడ్డాడు. సమయోచిత ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అద్భుత సెంచరీతో (179, 257 బంతుల్లో, 17 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియా పరువు కాపాడాడు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు.. ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ను స్లోగా మొదలు పెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతులాడి 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు. తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా స్కోర్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. టీమిండియా బ్యాటర్లలో జైస్వాల్ మినహా ఏ ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

ఒక్కడై నిలబడ్డాడు:

పెద్దగా ఎక్స్ పీరియన్స్ లేకపోయినా.. ఆడింది తక్కువ టెస్టు మ్యాచులే అయినా.. జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒకపక్క వికెట్లు పడుతుంటే.. సమయోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును స్కోర్ భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. మొదటి టెస్టులో బజ్ బాల్ టైప్ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్.. ఇవాళ పూర్తి భిన్నంగా కనిపించాడు. ఇంగ్లాండ్ స్పిన్ ఉచ్చులో చిక్కకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శుభ్ మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27) మరోసారి విఫలమయ్యారు. అరంగేట్ర బ్యాటర్ రజత్ పటిదార్ (32) పరవాలేదనిపించినా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. మరో వికెట్ పడకుండా తొలిరోజు ఇన్నింగ్స్ ను కొనసాగిస్తారనుకున్న అక్షర్ పటేల్ (27), కేఎస్ భరత్ (17) వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో భారత్ తొలిరోజు 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ (5), జైస్వాల్ (179) ఉన్నారు. ఇంగ్లాండ్ బైలర్లలో షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అండర్సన్, టామ్ హార్ట్లే తలా ఓ వికెట్ పడగొట్టారు.




Updated : 2 Feb 2024 6:13 PM IST
Tags:    
Next Story
Share it
Top