Home > క్రీడలు > Yashasvi Jaiswal : మాస్ అబ్బాయ్.. క్లాస్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీతో జైస్వాల్ విశ్వరూపం

Yashasvi Jaiswal : మాస్ అబ్బాయ్.. క్లాస్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీతో జైస్వాల్ విశ్వరూపం

Yashasvi Jaiswal : మాస్ అబ్బాయ్.. క్లాస్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీతో జైస్వాల్ విశ్వరూపం
X

(yashasvi jaiswal double hundred) ప్రత్యర్థి ఉచ్చులో పడి తోటి బ్యాటర్లంతో పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. తానొక్కడై క్రీజులో నిలబడ్డాడు. నేనున్నానంటూ.. భారత్ కు భరోసానిచ్చాడు. క్రీజులో అడ్డుగోడగా నిలబడ్డాడు. సమయోచిత ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఏ బాల్ ఎలా ఆడాలనే కచ్చితత్వం.. ఏ బౌలర్ పై దాడి చేయాలనే ప్రణాళిక.. సవాళ్లకు అడ్డు నిలిచి, పరిస్థితులకు అలవాటుపడి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ప్రదర్శనను పొడిగిడేందుకు మాటలు లేవు. ప్రతిభను పోల్చేందుకు గణాంకాలు లేవు. ప్రశాతంగా ఇన్నింగ్స్ ను ప్రారంభించి.. అద్భుత డబుల్ సెంచరీతో (209, 290 బంతుల్లో, 19 ఫోర్లు, 7 సిక్సర్లు) టీమిండియా పరువు కాపాడాడు. టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు. దీంతో భారత్ తరుపున అతిచిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన మూడో ప్లేయర్ గా జైస్వాల్ నిలిచాడు.





విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు.. ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ను స్లోగా మొదలు పెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతులాడి 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు. తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా స్కోర్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. టీమిండియా బ్యాటర్లలో జైస్వాల్ మినహా ఏ ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శుభ్ మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27) మరోసారి విఫలమయ్యారు. అరంగేట్ర బ్యాటర్ రజత్ పటిదార్ (32) పరవాలేదనిపించినా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. మరో వికెట్ పడకుండా తొలిరోజు ఇన్నింగ్స్ ను కొనసాగిస్తారనుకున్న అక్షర్ పటేల్ (27), కేఎస్ భరత్ (17) వెంటవెంటనే ఔట్ అయ్యారు. రెండో రోజు ఇన్నింగ్స్ ను కొనసాగిస్తాడనుకున్న అశ్విన్ (20) త్వరగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్ (4), బుమ్రా (1) ఉన్నారు. ఇంగ్లాండ్ బైలర్లలో షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అండర్సన్ 3, టామ్ హార్ట్లే ఒక వికెట్ పడగొట్టారు.








Updated : 3 Feb 2024 5:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top