Home > క్రీడలు > Jaiswal : ఓ ఇంటి వాడైన యశస్వి జైస్వాల్‌...అసలు విషయం ఏంటంటే?

Jaiswal : ఓ ఇంటి వాడైన యశస్వి జైస్వాల్‌...అసలు విషయం ఏంటంటే?

Jaiswal : ఓ ఇంటి వాడైన యశస్వి జైస్వాల్‌...అసలు విషయం ఏంటంటే?
X

టీమిండియా(Team India) యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) తన దైన ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. అతి చిన్న వయస్సులోనే క్రికెట్ లో తన సత్తా చాటుతూ..టీమిండియాను విజయ తీరాలకు చేరుస్తున్నాడు. అంతేగాక సోషల్ మీడియాలో అతని ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అటు అన్ని ఫార్మాట్లలోనూ దుమ్ములేపుతు రికార్డులు తిరగరాస్తున్నాడు. అటు ఐసీసీ ర్యాంకుల్లోనూ జోరు చూపించి టాప్-20 లోకి అడుగుపెట్టాడు. అయితే ఇతనికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. యశస్వి ఓ ఇంటివాడైనట్లుగా తెలుస్తోంది. పెండ్లి చేసుకొని కాదండి..ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతంలో యశస్వి ఓ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈస్ట్‌ బాంద్రాలో వింగ్‌ 3 ఏరియాలోని 1100 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫ్లాట్ ధర దాదాపు ఐదున్నర కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే చిన్నప్పటి నుంచి యశస్వి చాలా కష్టాలు అనుభవించాడు. పేదరికం కారణంతో అనేక బాధలను చవిచూసాడు. క్రికెటర్ గా మారే క్రమంలో అతని 22 ఏండ్లలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అతడిని తన కుటుంబం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తు వస్తున్నారు. అతడి కెరీర్ కోసం కుటుంబమంతా యూపీ నుంచి ముంబయికి షిప్ట్ అయ్యింది. అంతేగాక చిన్న టెంట్ లో అతని చిన్నతనమంతా గడిచిపోయింది. క్రికెట్‌ శిక్షణ కోసం వెళ్లే సమయంలో తన తండ్రితో పాటు పానీ పూరి బండి వద్ద కూడా పని చేశాడు. అన్ని కష్టాలు వచ్చిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని..జూనియర్‌ లెవల్‌లో తన సత్తా ఏంటూ నిరూపించాడు జైశ్వాల్. అండర్ -19 వరల్డ్‌ కప్‌ 2019లో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత క్రికెట్ కెరీర్ లో వెనక్కి తిరిగి చేసుకోలేదు. దీంతో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టే అవకాశం వచ్చింది. తొలిసారే రూ. 2.4 కోట్ల బిడ్‌ దక్కించుకున్నాడు ఈ యువ క్రికెటర్. రాజస్థాన్‌ రాయల్స్ తరఫున 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లోనే ఏకంగా 625 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అతడే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కేవలం మూడు టెస్టుల్లోనే రెండు డబుల్ సెంచరీలతో ఏకంగా 545 పరుగులు సాధించాడు.

Updated : 22 Feb 2024 12:32 PM IST
Tags:    
Next Story
Share it
Top