యూసఫ్ పఠాన్ ఊచకోత.. బౌలర్లకు చుక్కలు చూపించి.. 14 బంతుల్లోనే
X
అసలు టీ20 అంటే ఏంటో భారత్ కు పరిచయం చేశాడు మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. తాజాగా టీ10 లీగ్ లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. నాలుగు పదుల వయసులోనూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. యూఏఈ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్ లో జోబర్గ్ బఫ్ఫెలోస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసఫ్.. అజేయ హాఫ్ సెంచరీతో తన టీంను ఫైనల్స్ కు చేర్చాడు. డర్బన్ క్వాలాండర్స్ తో జరిగిన క్వాలిఫయర్ 1లో రెచ్చిపోయి ఒంటి చేత్తో తన టీంను గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 140 పరుగులు చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెజోస్.. 6 ఓవర్లలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. దాంతో ఇక ఓటమి ఖాయం అనుకున్న టైంలో క్రీజులోకి వచ్చిన యూసఫ్.. 26 బంతుల్లో 80 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 9 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. అమీర్ వేసిన 8వ ఓవర్లో ఏకంగా 25 పరుగులు చేశాడు.