Yuvraj Singh : రోహిత్ శర్మ బెస్ట్. హార్దిక్ గురించి నాకు తెలియదు.. అదంతా సెలక్టర్లు చూసుకుంటారు: యువరాజ్ సింగ్
X
ముంబై ఇండియన్స్ కు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను ఇటీవల కెప్టెన్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టునుంచి ముంబైకి మారి.. అనూహ్యంగా కెప్టెన్సీని అందుకున్నాడు. తనకు కెప్టెన్సీ ఇస్తేనే ముంబైకి వస్తానని ఫ్రాంచైజీతో పాండ్యా అంతర్గత ఒప్పందాలు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఐదుసార్లు చాంపియన్ గా నిలబెట్టిన వ్యక్తి.. హార్దిక్ సారథ్యంలో ఆడాలా అని అభిమానుల్లో తెలియని అసంతృప్తి నెలకొంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఈ ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తాయని, రోహిత్ ఈ ఐపీఎల్ లో ముంబైకి దూరంగా ఉండి, వచ్చే సీజన్ లో వేరే ఫ్రాంచైజీకి ఆడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.
‘ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఇలాంటివి జరగడం కామన్. వారికి ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుని సాల్వ్ చేసుకోవాలి. హార్దిక్, రోహిత్ మధ్య అలాంటి సమస్య ఏం లేదని నాకు అనిపిస్తుంది. పాండ్యా ముంబైకి ఆడినప్పుడు.. అతనిలోని ఉత్తమ ప్రదర్శనను వెలికి తీయడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. పాండ్యా గుజరాత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగి మంచి ప్రదర్శన చేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తారా అంటే.. అది అతని ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది. ఇది సెలక్టర్లు నిర్ణయించాల్సిన విషయం. రోహిత్ గొప్ప కెప్టెన్. ముంబైకి ఐదు ట్రీఫీలు అందించాడు. వన్డే వరల్డ్ కప్ లో ఇండియాను ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. టీమిండియాకు లభించిన గొప్ప కెప్టెన్ లో రోహిత్ ఒకడు. హార్దిక్ ఫిట్ నెస్ గురించి నాకు తెలియదు. అదంతా సెలక్టర్లు చూసుకుంటార’ని యువరాజ్ చెప్పుకొచ్చాడు.