Home > క్రీడలు > జింబాబ్వే టీ10 లీగ్‌‌ షెడ్యూల్ విడుదల...

జింబాబ్వే టీ10 లీగ్‌‌ షెడ్యూల్ విడుదల...

జింబాబ్వే టీ10 లీగ్‌‌ షెడ్యూల్ విడుదల...
X

జింబాబ్వే టీ10 లీగ్‌‌ తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. జింబాబ్వే క్రికెట్ మరియు టీ టెన్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఈ లీగ్‎లో 5 ప్రాంచైజీలు బులవాయో బ్రేవ్స్‌, కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ, డర్బన్‌ ఖలందర్స్‌, హరారే హరికేన్స్‌, జోహనెస్‌బర్గ్‌ బఫెలోస్‌ టీమ్‌లు తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 20 నుండి జూలై 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొత్తం24 మ్యాచ్‌‌లు నిర్వహించనున్నారు.

జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌‌లో ఆ దేశ క్రికెటర్లతో పాటు ప్రముఖ విదేశీ క్రికెటర్ల పాల్గొంటున్నారు. భారత్‌కు చెందిన స్టువర్ట్‌ బిన్నీ, పార్థివ్‌ పటేల్‌, రాబిన్‌ ఉతప్ప, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌లు టీ10 లీగ్‌‌లో సందడి చేయనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆరుగురు టీ10 లీగ్‌‌లో ఏమాత్రం రాణిస్తారో చూడాలి. భారత్ ప్లేయర్స్ ఉండడం అభిమానులకు సైతం జింబాబ్వే టీ10 లీగ్‌‌పై ఆసక్తినెలకొంది.

మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం 11:30 గంటలకు, 1:30 గంటలకు.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్‌ తరహాలోనే ఈ లీగ్‌లో రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌లు (20), రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్‌ మ్యాచ్‌, తర్వాత ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

జిమ్ ఆఫ్రో T10 2023 లీగ్ జట్లు, ఆటగాళ్లు:

డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహమ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సీఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా బేగ్, తయ్యబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్, టెండై చటారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్.

హరారే హరికేన్స్: ఇయాన్ మోర్గాన్, మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవన్ ఫెరీరా, షానవాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తిగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోంగ్వే, బ్రాండన్ మవుతా, తషింగా శ్రీసన్ పట్హాన్, ఐ స్ర్ఫా శ్రీసన్ పట్హాన్,

జోబర్గ్ బఫెలోస్: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డాలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మొహమ్‌మెద్ షుంబా, రాహుల్ చోప్రేజ్.

బులవాయో బ్రేవ్స్: సికందర్ రజా, తస్కిన్ అహ్మద్, అష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసార పెరెరా, బెన్ మెక్‌డెర్మాట్, బ్యూ వెబ్‌స్టర్, ర్యాన్ బర్ల్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్ట్, టిమిసెన్ మారుమా, జాయ్‌లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.

కేప్ టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, సీన్ విలియమ్స్, భానుకా రాజపక్సే, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, హామిల్టన్ మసకద్జా, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హాట్జోగ్లౌ, మాథ్యూ బ్రీట్జ్‌కే, రిచర్డ్ న్గారవ, జువావో సెఫాస్, మహ్మద్ ట్యుమ్‌టుర్షిన్, స్ఫన్‌టుర్షిన్, మహ్మద్, అకేవే, పార్థివ్ పటేల్.

Updated : 13 July 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top