Home > క్రీడలు > టాప్ లేపిన జింబాబ్వే.. వన్డే క్రికెట్లో అత్యధిక స్కోర్..!

టాప్ లేపిన జింబాబ్వే.. వన్డే క్రికెట్లో అత్యధిక స్కోర్..!

టాప్ లేపిన జింబాబ్వే.. వన్డే క్రికెట్లో అత్యధిక స్కోర్..!
X

ప్రపంచకప్ లో పసి కూన అనుకున్న జింబాంబ్వే జట్టు పంజా విసురుతోంది. జట్టేదైనా సరే బరిలోకి దిగిన తర్వాత జింబాబ్వే చేతిలో చిత్తవ్వాల్సిందే. ఏదో కసితో ఉన్నట్లు.. ఈ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023 ప్రతీ మ్యాచ్ లో రఫ్ఫాడిస్తున్నారు. దాంతో ఇప్పటికే తన బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది జింబాబ్వే. టోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే ప్లేయర్స్ రెచ్చిపోయారు. 304 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులు చేసింది. అయితే వన్డేల్లో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అంతకుముందు 2006లో కెన్యాతో జరిగిప మ్యాచ్ లో 351 పరుగులు చేసింది. ఇప్పటివరకు అదే అత్యధిక స్కోర్ కాగా.. దాన్ని ఇప్పుడు అది గమించింది.

406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 104 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వూ కెప్టెన్ విలియమ్స్.. 174, 101 బంతుల్లో కాస్తతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేల్లో జింబాబ్వే తరుపున అత్యధిక స్కోర్ చేసిన కెప్టెన్ గా విలియమ్స్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే బ్యాట్స్ మెన్ గుంబే (78), బర్ల్ (47) కూడా అమెరికా బౌలర్లపై రెచ్చిపోయారు.


Updated : 26 Jun 2023 10:27 PM IST
Tags:    
Next Story
Share it
Top