పర్సనల్ డేటా సేకరిస్తున్న రియల్ మీ.. కేంద్రం దర్యాప్తు..!
X
డేటా చోరీ.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో తరుచుగా ఇది వింటూ ఉన్నాం. మన ఫోన్లో ఉండే కొన్ని యాప్స్ ఈ పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సారి యాప్ మీద కాకుండా ఫోన్ కంపెనీపైనా వచ్చాయి. చైనాకు చెందిన రియల్ మీ ఫోన్స్ కంపెనీ కస్టమర్ల డేటా చోరీ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
రియల్ మీ సంస్థ సెల్‌ఫోన్లలో ప్రవేశపెట్టిన ‘ఎన్‌హేన్స్‌డ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్’ ఫీచర్‌పై ఓ వ్యక్తి ట్విట్ చేశారు. ఈ ఫీచర్ వ్యక్తి యొక్క పర్సనల్ డేటా సేకరిస్తోందని రిషి బగ్రీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. కాల్ లాగ్స్, లోకేషన్, మెస్సేజులను ఇది క్యాప్చర్ చేస్తుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమతి లేకుండానే డిఫాల్ట్ గా ఈ ఫీచర్ ఆన్ అయి ఉండడాన్ని ఆయన సందేహించారు. ఈ ట్వీట్పై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్స్ లోపల ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దీన్ని గురించి తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు చెబుతున్నారు. ఇక రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే కంపెనీకి రిజైన్ చేశారు.
Will hv this tested and checked @rishibagree
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 16, 2023
copy: @GoI_MeitY https://t.co/4hkA5YWsIg