Instagram : ఇన్స్టాలో మెసేజ్ ఎడిట్ ఫీచర్...ఎలా వాడాలంటే?
X
(Instagram) సోషల్ మీడియాలో ఇన్స్టాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యువత ఎక్కువగా వాడే యాప్ ఏది అంటే అది ఇన్స్టానే. ఫేస్బుక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ యాప్ ఇప్పుడు ఫేస్బుక్ (Facebook) నే మించిపోతుంది. ప్రస్తుతం ఇన్ స్టా కొత్తగా ఎడిట్ ఫీచర్ ను తీసుకువచ్చింది. వాట్సప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకే పరిమితమైన మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా తీసుకొచ్చింది.
మనం ఇన్‌స్టా లో ఇంత పెద్దగా మెసేజ్ పంపుతాం. తీరా పంపిన తర్వాత చూసుకుంటే తప్పు ఉంటుంది. ఏం చేస్తాం చేసేది లేక దాన్ని డిలీట్ కొట్టి మళ్లీ అదే టైప్ చేస్తాం. కదా! మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైందా? అయితే ఇది మీకోసం!. ఇన్‌స్టా (Instagram) ఇప్పుడు సరికొత్త ఎడిట్ ఫీచర్ తీసుకువచ్చింది. మీరు పంపిన మెసేజ్‌లో ఏదైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకొనే వీలుగా ఒక ఆప్షన్ (option) తెచ్చింది. ఇకపై ఇన్‌స్టాలో పంపిన మెసేజ్‌లో తప్పులుంటే వెంటనే కరెక్ట్ చేసేందుకు వీలుగా ‘ఎడిట్’ (Edit) ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ తన బ్లాగ్‌లో తెలిపింది.
ఇప్పటివరకు ఇన్‌స్టాలో పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులుంటే వాటిని డిలీట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ ‘ఎడిట్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సప్ (WhatsApp), టెలిగ్రామ్ (Telegram) యాప్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్...ఇక మీద ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అందుబాటులో ఉండనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మెసేజ్ పంపినాక దాన్ని సెలెక్ట్ చేస్తే ‘edit’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు సరిచేయొచ్చు. అయితే, మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు ఐదు సార్లు మాత్రమే ఎడిట్ చేసే వెసులుబాటు కల్పించింది. అంతేగాక మీరు ఎడిట్ చేసినట్లు అవతలి వ్యక్తికి లేబుల్ కనిపిస్తుంది.