chandrayaan-3 : ‘సూపర్ బ్లూ మూన్’గా కనువిందు చేస్తున్న చందమామ
X
ఆకాశంలో బ్లూ మూన్ కనువిందు చేస్తోంది. భూమికి సుమారు నాలుగు లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న జాబిల్లి అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ మిరుమిట్లు గొలుపుతోంది. పౌర్ణమి వేళ నిండైన రూపంతో మరింత పెద్దగా, సాధారణంగా ఉండే జాబిల్లి కన్నా మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ అందరినీ పులకించేలా చేస్తోంది. ఈ సూపర్ మూన్‌ని చూస్తూ అందరూ వావ్ అని అంటున్నారు. పిల్లలు జాబిల్లి అద్భుతమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకే నెలలో ఇలా రెండోసారి నిండు చందమామ అందరికీ ఆనందాన్ని పంచుతోంది.
వరల్డ్ వైడ్‌గా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆగస్టు 30 లేదా 31 తేదీల్లో చందమామ ఇలా అలరించనుంది. అయితే, ఈసారి శనిగ్రహం కూడా తోడవడం విశేషం చందమామకు ఓ 5 డిగ్రీల ఎత్తులో ఓ ప్రకాశవంతమైన బిందువుగా శనిగ్రహం కనిపిస్తోంది. నాసా ప్రకారం, భారత్‌లో ఈ బ్లూమూన్ ఇవాళ 9.30గంటల నుంచి ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సూపర్ బ్లూ మూన్ మాత్రం ఆగస్టు 31 ఉదయం 7గంటల ప్రాంతంలో గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.
చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ‘సూపర్‌మూన్’గా పరిగణిస్తాం. ఈ రోజు ఎప్పికన్నా 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా చందమామ కనిపిస్తుంది. శాస్త్రవేత్త ప్రకారం దీనిని పెరీజియన్ పౌర్ణమిగా పిలుస్తారు. అందులోనూ ఒకే నెలలో రెండుసార్లు నిండు పౌర్ణమి ఏర్పడటం వల్ల దీనిని సూపర్ బ్లూ మూన్ గా చెబుతున్నారు. బ్లూ మూన్ అనగానే చందమామ నీలంగా ఉండదు. 2018లో ఇలా ఒకేనెలలో రెండుసార్లు బ్లూ మూన్ కనిపించింది. ఈ రోజు అనంతరం మళ్లీ 2037లో మాత్రమే ఇలా జరగనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
#WATCH | Assam: Visuals of Super Blue Moon from Guwahati. pic.twitter.com/r8lNgwEKoC
— ANI (@ANI) August 30, 2023