Home > టెక్నాలజీ > Aadhaar New Scams : UIDAI హెచ్చరిక..ఆధార్‌ అప్‌డేట్‌ అంటూ మోసాలు

Aadhaar New Scams : UIDAI హెచ్చరిక..ఆధార్‌ అప్‌డేట్‌ అంటూ మోసాలు

Aadhaar New Scams : UIDAI హెచ్చరిక..ఆధార్‌ అప్‌డేట్‌ అంటూ మోసాలు
X

ఆధార్‌ కార్డ్ అప్‌డేట్‌ చేయాలంటూ మెసేజ్‌లు వస్తున్నాయా? వాట్సాప్, ఇ-మెయిల్స్‎కు వివరాలు చెప్పాలంటూ సందేశాలు వస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త సైబర్ నేరగాళ్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని కాజేసేందుకు కాచుకుని కూర్చున్నారు. జాగ్రత్త పడకుంటే వారి ఉచ్చులో చిక్కుతారంటూ తాజాగా UIDAI హెచ్చరికలు జారీ చేసింది.

సైబర్ నేరగాళ్లు, ఆధార్‌ అప్‌డేట్‌ అంటూ మోసాలకు పాల్పాడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

"ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాంటి సమాచారాన్ని ఎప్పుడూ అడగవు. వాట్సాప్‎లకు , ఈ-మెయిల్స్‎కు సందేశాలు పంపదు. ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అడగదు. మీ దగ్గర్లోని ఆధార్‌ సెంటర్లలో లేదా ఆలైన్‎లో అధికారిక ఆధార్‌ పోర్టల్‌‎లో మాత్రమే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి" అంటూ UIDAI తన ట్విటర్ ఖాతాలో ప్రజలను అలర్ట్ చేసింది. ఆధార్ అప్‎డేట్ కోసం మరో మార్గం వద్దని సూచించింది.

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ చేసుకోవాలంటే ముందుగా ఆధార్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. ఆ తరువాత ప్రొసీడ్ టు అప్‌డేట్‌ అడ్రస్ అనే ఆప్షన్‎ను

ఎన్నుకోగానే రిజిస్టర్డ్‌ ఫోన్ నెంబర్‌కు ఓ ఓటీపీ మెసేజ్ ద్వారా వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే డాక్యుమెంట్ అప్‌డేట్‌ అని ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై మీ ఆధార్‌ వివరాలు వస్తాయి. అందులో అప్‌డేట్‌ చేయాల్సింది ఉంటే చేయాలి. లేదా ఆ తరువాత ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. సవరణలు అయిపోగానే స్క్రీన్‌పైన డ్రాప్‌ డౌన్‌ ఆప్షన్ పై క్లిన్ చేయాలి అందులో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో స్కాన్ చేసిన డాక్యుమెంట్ల కాపీలను అప్‌లోడ్‌ చేసి Submit చేయాలి అనంతరం 14 అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ వస్తుంది. దీంతో మీ ఆధార్‌‎లో సవరణలు పూర్తి అవుతాయి.


Updated : 18 Aug 2023 7:50 PM IST
Tags:    
Next Story
Share it
Top