Home > టెక్నాలజీ > Aditya-L1 : ఆదిత్య ఎల్ 1 ప్రయోగంలో పూర్తైన మరో కీలక ఘట్టం

Aditya-L1 : ఆదిత్య ఎల్ 1 ప్రయోగంలో పూర్తైన మరో కీలక ఘట్టం

Aditya-L1 : ఆదిత్య ఎల్ 1 ప్రయోగంలో పూర్తైన మరో కీలక ఘట్టం
X

సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచిన ఇస్త్రో సైంటిస్టులు సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి తాజాగా ట్వీట్ చేసిన ఇస్రో.. ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్ లగ్రాంజ్‌ పాయింట్‌-1 వైపు దూసుకెళుతోంది. తద్వారా ఆదిత్య ఎల్ -1 భూప్రదక్షిణ దశ ముగించుకుని.. సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.





ఆదిత్య ఎల్ - 1 ఉపగ్రహ భూకక్ష్యను 4సార్లు పెంచగా.. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్‌ పాయింట్‌-1 వైపు పంపారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్‌-1ను లగ్రాంజ్‌ పాయింట్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. బెంగళూరులోని టెలి మెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో దీన్ని ఆపరేట్ చేస్తోంది. మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి.

చంద్రయాన్‌-3 గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో సూర్యుడిపై పరిశోధనలకు సెప్టెంబర్‌ 2న ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. సౌర వాతావరణాన్ని పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ నుంచి సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1 నుంచి ఆదిత్య ఎల్ 1 సూర్యుడిపై పరిశోధనలు జరపనుంది.




Updated : 19 Sept 2023 9:16 AM IST
Tags:    
Next Story
Share it
Top