Aditya L1 : నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య- ఎల్ 1.. అంతా సజావుగానే
X
అంతరిక్షంలో మరో అపూర్వ విజయానికి సిద్ధమైంది ఇస్రో. సూర్యుడి సమీపానికి చేరుకునేలా ఆదిత్య ఎల్1 మిషన్ కాసేపటి క్రితమే లాంచ్ అయింది. గా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) తాజాగా ప్రయోగానికి వేదికైంది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. 15 లక్షల కిలోమీటర్లు, 4 నెలల పాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’ (లగ్రాంజ్) పాయింట్‌ను చేరుకోనుంది. ఎలాంటి అవంతరాలు లేకుండా రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళుతుంది.
15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.చంద్రయాన్ 3 తర్వాత ISRO ప్రయోగించిన ఈ మిషన్ పై అందరి దృష్టి ఉంది.