Aditya-L1: బ్రహ్మ ముహూర్తాన్ని ప్రకటించిన ఇస్రో
X
చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం అయింది. దీంతో ఇస్రో మరో కీలక అంతరిక్ష యాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్-1 (Aditya L -1) ఉపగ్రహాన్ని లాంచ్ చేయడంకోసం ముహూర్తం ఖరారయింది. ఊహించని అవాంతరాలు ఏర్పడితే తప్ప ప్రయోగం వాయిదా పడదని ఇస్రో అధికారులు తెలిపారు. కాగా, సెప్టెంబర్ 2న (శనివారం) ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్యను ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఆదిత్య ఎల్-1ను శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. ఇస్రో నమ్మినబంటు పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌకను నుంచే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు.
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. కరోనాగ్రఫీ పరికరం ద్వారా సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగాన్ని ఇస్రో.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో చేపడుతోంది. కాగా, ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు కూడా అవకాశం కల్పించింది. దీనికోసం ఆగస్ట్ 29 (మంగళవారం) మధ్యాహ్నం నుంచి టికెట్ల కోసం ఇస్రో వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆదిత్య ఎల్-1 విశేషాలివే:
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు మన దేశం చేపడుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. సూర్యుడిపై వచ్చే మార్పులను, సూర్య పదార్థాలను నిరంతం అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీనిద్వారా శక్తిమంతమైన సూర్యకాంతిని అధ్యయనం చేస్తారు. సూర్య రేణువులను, అయస్కాంత క్షేత్రాలను విశ్లేషిస్తారు. ఎలక్ట్రో మ్యాగ్నెట్ వంటి పరికరాలతో సూర్యడి వెలుపలి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా(వలయం)లను అధ్యయనం చేస్తారు. 1,500 కిలోల బరువున్న ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి సూర్యునివైపు 15 లక్షల కి.మీ దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి పంపుతారు. 120 రోజులు ప్రయాణించి ఈ పాయింట్ చేరుకుంటుంది.
ఉపగ్రహంలోని మొత్తం ఏడు పేలోడ్లతో ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ కీలకమైనది. దీని ద్వారా గ్రహణాల సమయంలోనూ సూర్యుడిని సమగ్రంగా అధ్యయనం చేయొచ్చు. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ ఇతర పేలోడ్లు. 2008లో ఆదిత్య ఎల్ 1 ప్రణాళిక రూపుదిద్దుకొంది. మొదట 440 పేలోడ్లతో ప్రయోగించాలనుకున్నా తర్వాత ప్రాజెక్టును విస్తరించారు. ప్రయోగ ఖర్చుల కాకుండా దాదాపు రూ. 500 కోట్ల వరకు దీనికి కేటాయించినట్లు అంచనా.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
— ISRO (@isro) August 28, 2023
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.
Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx