Home > టెక్నాలజీ > Aditya L1 Mission : జనవరి 6న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1..!

Aditya L1 Mission : జనవరి 6న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1..!

Aditya L1 Mission  : జనవరి 6న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1..!
X

సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. సౌర వాతావరణాన్ని పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ నుంచి సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ పాయింట్‌-1 నుంచి ఆదిత్య ఎల్ 1 సూర్యుడిపై పరిశోధనలు జరపనుంది. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక విషయాలను వెల్లడించారు. ఆదిత్య ఎల్ 1 జనవరి 6న తన కక్ష్యలోకి చేరుకుంటుందని అంచనా వేశారు.





భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌ -1 జనవరి 6న చేరుకుంటుందని భావిస్తున్నట్లు సోమనాథ్ చెప్పారు. ఎల్‌1 పాయింట్‌లోకి చేరగానే స్పేస్ క్రాఫ్ట్ మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేకదిశలో ఇంజిన్‌ను మండిస్తామన్నారు. దాంతో అది ఆ కక్ష్యలో స్థిరంగా కుదురుకుంటుందని వివరించారు. ఆదిత్య ఎల్1 కుదురుకున్నాక ఆ కక్ష్యలోనే తిరుగుతూ సూర్యుడి వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలు పెడుతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లపాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేషించనుందని.. భారత్‌కు మాత్రమేకాదు యావత్‌ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్‌1 అందించనుంది స్పష్టం చేశారు.





Updated : 24 Dec 2023 2:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top