Samsung S24 series : మార్కెట్లోకి గెలాక్సీ S24 సిరీస్.. రేటు ఎంతటే..
X
సౌత్ కొరియా స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో కొత్తగా మరో మోడల్ ఫోన్లు మార్కెట్లోకి తెచ్చింది. గెలాక్సీ ఎస్24 సిరీస్ మొబైళ్లను బుధవారం రిలీజ్ చేసింది. ఎస్24, ఎస్24+, ఎస్24 అల్ట్రా పేరుతో మూడు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ తాజాగా వాటి రేట్లు ప్రకటించింది. 6.8 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2X స్క్రీన్, 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా తదితర ఫీచర్లతో రూపొందించిన ఈ మొబైళ్లకు ఏడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఈ ఫోన్లలో రియల్ టైం వాయిస్ కాల్, మెసేజ్ ట్రాన్స్ లేషన్, ఇమేజ్ ఎడిటింగ్, కెమెరా ఎఫెక్స్ట్ ఫీచర్లను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్తో అనుసంధానించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇక ఈ ఫోన్ల ఫీచర్లు, ధర విషయానికొస్తే..
గెలాక్సీ ఎస్24
120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన గెలాక్సీ ఎస్ 24 6.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO డిస్ ప్లేతో వస్తుంది. అమెరికా, సౌత్ కొరియా, చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, భారత్ సహా ఇతర దేశాల్లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చే ఈ ఫోన్లకు 7 ఏండ్ల వరకు ఓఎస్ అప్‌డేట్లు ఇవ్వనున్నారు. కెమెరా విషయానికొస్తే 50MP ఓఐఎస్+ 12MP అల్ట్రావైడ్+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్ జూమ్ లెన్స్ బ్యాక్ కెమెరా ఉండగా.. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 25 వాట్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్, 4.5 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ కోబాల్ట్ వయొలెట్, ఆంబర్ యెల్లో, ఒనిక్స్ బ్లాక్, మార్బుల్ గ్రే, జేడ్ గ్రీన్, సఫైర్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికొస్తే గెలాక్సీ ఎస్24 8GB+256GB - రూ.79,999, 8GB+512GB - రూ.89,999లుగా నిర్ణయించారు.
గెలాక్సీ ఎస్24+
120Hz రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO డిస్ ప్లేతో వచ్చే గెలాక్సీ ఎస్ 24+ను అమెరికా, దక్షిణ కొరియా, చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, భారత్ సహా ఇతర దేశాల్లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ తో రూపొందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ మొబైల్ కు 50MP ఓఐఎస్+ 12MP అల్ట్రావైడ్+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్ జూమ్ లెన్స్ బ్యాక్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. 45వాట్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్, 4.5 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ కోబాల్ట్ వయొలెట్, ఒనిక్స్ బ్లాక్, జేడ్ గ్రీన్, సఫైర్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఎస్24+ ధర 12GB+256GB - రూ.99,999, 12GB+512GB - రూ.1,09,999గా నిర్ణయించారు.
గెలాక్సీ ఎస్24 అల్ట్రా
120Hz రిఫ్రెష్ రేట్ 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO ఫ్లాట్ డిస్ ప్లే కలిగిన ఈ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ ఫోన్ 200MP ఓఐఎస్+ 12MP అల్ట్రావైడ్+ 50MP 5x టెలిఫొటో OIS+ 10MP 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ బ్యాక్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 45వాట్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్, 4.5 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వయొలెట్, టైటానియం యెల్లో, టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్ కలర్స్లో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 12GB+256GB - రూ.1,29,999, 12GB+512GB - రూ.1,39,999, 12GB+1TB - రూ.1,59,999గా ఉంది.