Home > ఆంధ్రప్రదేశ్ > Devaragattu Bunny Festival: కర్రల సమరానికి కౌంట్ డౌన్ షురూ..

Devaragattu Bunny Festival: కర్రల సమరానికి కౌంట్ డౌన్ షురూ..

Devaragattu Bunny Festival: కర్రల సమరానికి కౌంట్ డౌన్ షురూ..
X

ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హోలగుంద మండలం దేవరగట్టులో నేటి అర్థరాత్రి మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి అర్థరాత్రి పూట కర్రల సమరం మొదలుకానుంది. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు రెండు వేల మంది పోలీసులతోపాటు వందమంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కర్రల సమరంలో గాయపడ్డ భక్తులకు వెంటనే చికిత్స అందించడం కోసం తాత్కాలికంగా ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకోవడానికి తెల్లారేవరకు కర్రల సమరం జరుగుతుంది. మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు మూడు గ్రామాలు ఓ వైపు, ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి ఆరు గ్రామాలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు.

ఉత్సవ విగ్రహాన్ని దక్కించుకోవడానికి ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకుంటారు. ప్రాణాలు పోతున్నా, శరీరాలు రక్తమోడుతున్నా లెక్క చేయరు. ఈ రోజు అర్థరాత్రి జరగనున్న ఈ వేడుకలో ఎంతమంది గాయపడతారో అనే విషయం టెన్షన్ అందర్లోనూ నెలకొంది. ఇదిలా ఉండగా, అయితే, 2020 బన్నీ ఉత్సవంపై పోలీసులు నిషేధం విధించారు. కానీ దీన్ని ఎవరూ పాటించలేదు. దీంతో యదావిధిగా హింసాత్మకంగా మారింది. మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడానికి రెండు గ్రామాలకు చెందిన వేలాదిమంది కర్రలతో కొట్టుకుంటారు. ఐతే మాములు కర్రలతో కాదు.. కర్రలకు ఐరన్‌ రింగులను బిగించి వాటితో విరుచుకుపడుతారు. ఎవరికి ఎవరిపై కోపం ఉండదు. ఆవేశమూ కాదు. బన్నీ ఉత్సవంలో కర్రల సమరం ఆనవాయితీలో భాగం అంటారు.

దేవరగట్టు మాల సహిత మల్లేశ్వరస్వామి ఆలయ చరిత్ర కు చాలా ప్రాధాన్యత ఉంది. దేవరగట్టు అటవీ ప్రాంతంలో సముద్ర మట్టనికి సుమారు 2000 వేల అడుగుల ఎత్తేన కొండ గుహలో మాలమ్మ గా పార్వతి దేవి.. మల్లేశ్వరుడుగా శివుడు స్వయంభువుగా వెలిశారని చారిత్రక నేపథ్యం. బన్నీ ఉత్సవంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు.




Updated : 24 Oct 2023 4:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top