Home > టెక్నాలజీ > 50% డిస్కౌంట్తో.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. కార్డ్స్పై స్పెషల్ ఆఫర్

50% డిస్కౌంట్తో.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. కార్డ్స్పై స్పెషల్ ఆఫర్

50% డిస్కౌంట్తో.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. కార్డ్స్పై స్పెషల్ ఆఫర్
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షాపింగ్ లవర్స్ కు.. ఓ బంపర్ ఆఫర్ దొరికింది. ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ఆఫర్లకు తెరలేపింది. 50 శాతం డిస్కౌంట్స్ తో జులై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంటుందని ప్రకటించింది. అయితే, ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ సేల్ లో ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోం అప్లయెన్సెస్ పై డిస్కౌంట్ అందనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డ్స్, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్, ఈఎంఐ ట్రాన్ సాక్షన్స్ పై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ పే- ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉన్నవాళ్లకు అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డ్ తీసుకుంటే రూ. 2500 విలువగల కూపన్స్ అందుతాయి. ఇప్పటికే ఈ ఆఫర్ కు సంబంధించి కొన్ని రివీల్ కాగా.. మరికొన్ని తెలియాల్సి ఉంది.



Updated : 28 Jun 2023 10:01 PM IST
Tags:    
Next Story
Share it
Top