Amazon Great Freedom Festival: ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. కాస్త వెయిట్ చేయండి
X
ఇండిపెండెన్స్ డే సమీపిస్తున్నందున ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా(Amazon India) మరోసారి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లను తీసుకొస్తోంది. ఈ కొత్త సేల్‌కు సంబంధించిన డేట్స్‌ను రివీల్ చేసింది. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై.. 4 రోజుల తర్వాత అంటే ఆగస్టు 9వ తేదీన ముగియనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 12 గంటల ముందుగానే ఈ ఆఫర్లను పొందొచ్చు.
స్మార్ట్‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అంటే..
అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు ఇతర వస్తువులన్నింటిపైనా 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. అంతేకాదు SBI బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించే వ్యక్తులు 10 శాతం తగ్గింపును పొందనున్నట్లు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది. Samsung, OnePlus, Realme వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
ల్యాప్ టాప్‌లపై 75 శాతం వరకు తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లు , వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాదు యాపిల్ సహా ఇతర ప్రముఖ బ్రాండ్ల టాబ్లెట్లపై సేల్ ద్వారా 50 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
4K స్మార్ట్‌టీవీలపైనా..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో హెడ్ ఫోన్లు, స్పీకర్లపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. కొన్ని బ్యాంకు కార్డులను ఉపయోగించడం వల్ల మరిన్ని డిస్కౌంట్లను పొందొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా స్మార్ట్ టీవీలను కూడా తక్కువ ధరకే పొందొచ్చు. కొన్ని 4K టీవీలు 60 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులోకి రానున్నాయి.
ఇంట్లో వస్తువులపై..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ద్వారా వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లతో పాటు ఇంటికి సంబంధించిన ఇతర వస్తువులపై కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. సోనీ నుంచి వచ్చే ప్లేస్టేషన్ 5తో సహా గేమింగ్ ఉత్పత్తులు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ద్వారా డిస్కౌంట్లను పొందొచ్చు. వీటిపై 50 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఏయే వస్తువులపై డిస్కౌంట్లు లభించనున్నాయో తెలిపిన అమెజాన్ కంపెనీ.. దేనిపై ఎంత వరకు కచ్చితమైన తగ్గింపు లభిస్తుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఫుల్ క్లారిటీ కావాలంటే మరో 4 రోజుల పాటు ఆగాల్సిందే.