Amazon : అమెజాన్ షేర్లు అమ్మకానికి.. విలువ ఎంతో తెలుసా ?
X
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో కంపెనీకి చెందిన 50 మిలియన్ల 5 కోట్లు షేర్లను విక్రయించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో షేరుకు 171.8 డాలర్లుగా ఉన్నది. అమెజాన్ షేర్ల మొత్తం విలువ 8.6 బిలియన్ డాలర్లు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. షేర్ల విక్రయానికి సంబంధించిన ప్రణాళిక గతేడాది 8న మొదలైంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన అమ్మకాలు నమోదవగా.. అమెజాన్ షేర్లు ప్రస్తుతం దాదాపు 8శాతం పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న బెజోస్ ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి గత త్రైమాసికంలో అమెజాన్ ఆన్‌లైన్ అమ్మకాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. గత ఏడాది అమెజాన్ షేర్లు 80 శాతానికిపైగా పెరిగి బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ను అధిగమించాయి. బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బెజోస్ ప్రస్తుతం 185 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.
బెజోస్ నిర్ణయం అనంతరం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద శుక్రవారం 12.1 బిలియన్ డాలర్లు లాభపడింది. బిలియనీర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ అధిగమించాలంటే బెజోస్‌కు 8.1 బిలియన్ డాలర్లకు కావాల్సి ఉంది. కాగా, బెజోస్ 2021 నుండి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతూ వస్తున్నారు. కానీ అదెప్పుడ సాధ్యపడలేదు. జెఫ్ బెజోస్ మాజీ సతీమణి మకెంజీ స్కాట్ సైతం గత సంవత్సరం అమెజాన్‌లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్‌లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు. ఆ సమయంలో మెకెంజీ స్కాట్‌కి అమెజాన్‌లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు. దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.