రూ. 2 వేల నోట్లున్నోళ్లకు అమెజాన్ షాక్..
X
రూ. 2 వేల నోట్లు రద్దుకానుండడంతో అవి ఉన్నవాళ్లు బాగా ఖర్చు చేస్తున్నారు. ఒక పరిమితి వరకే మార్చుకునే వీలు ఉండడం, భారీగా మార్చుకుంటే ఐటీ అధికారులు పసిగడతారని భయపడుతున్నారు. పెట్రోల్, నగలు, ఆన్ లైన్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ)కి కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ కస్టమర్లు రూ. 2 వేల నోట్లను ఎక్కువగా ఇస్తుండడంతో కొన్ని కంపెనీ తలలు పట్టుకుంటున్నారు. వాటిని మార్చుకునే శ్రమ తప్పించుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఇకపై సీఓడీలకు రూ. 2 వేల నోట్లను తీసుకోకూడదని ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ నిర్ణయించింది. ఈనెల సెప్టెంబర్ 19 నుంచి వాటిని స్వీకరించబోమని, అయితే థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ చేసే డెలివరీలకు తీసుకుంటామని తెలిపింది. బ్యాంకుల్లో రూ. 2000 మార్పిడికి గడువు ఈ నెల 30తో ముగియనుండడం తెలిసిందే. చలామణిలో ఉన్న ఆ పెద్దనోట్లో 93 శాతానికిపైగా తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి.