Home > టెక్నాలజీ > అమెజాన్ కొత్త పాలసీ...ఉద్యోగం ఉండాలంటే పాటించాల్సిందే

అమెజాన్ కొత్త పాలసీ...ఉద్యోగం ఉండాలంటే పాటించాల్సిందే

అమెజాన్ కొత్త పాలసీ...ఉద్యోగం ఉండాలంటే పాటించాల్సిందే
X

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తర్వాత ఉద్యోగులతో చూసిచూడనట్టు ఉన్న కంపెనీ...ఇప్పుడు మాత్రం ఉద్యోగులు అందరూ కచ్చితంగా వారానికి మూడు రోజులు ఆఫీస్ కు రావాల్సిందే అంటూ రూల్ పెట్టింది.

కోవిడ్ మొదలైన దగ్గర నుంచీ దాదాపు అందరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. కోవిడ్ తగ్గిపోయి రెండేళ్ళు కావస్తున్నా ఇంకా ఆఫీసులకు రావడానికి మొగ్గు చూపించడం లేదు. ఆఫీసులకు రావాలని కంపెనీలు చెబుతున్నా...పలు కారణాలు చెబుతూ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. అందుకే అమెజాన్ ఓ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ కు రావాలని రూల్ పెట్టింది. కార్యాలయం నుంచి పని చేయడం వలన ఉద్యోగులు మరింత ఉత్సాహం చేస్తారని దాని ద్వారా వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు అమెజాన్ అధికార ప్రతినిధి.

ఇప్పుడు అమెజాన్ పెట్టిన కొత్త రూల్ కు ఉద్యోగులు భయపడుతున్నారు. ఆఫీస్ లకు రాము అని వ్యతిరేకిస్తే ఉద్యోగాలు ఊడతాయేమోనని వర్రీ అవుతున్నారు. రెసిషన్ కారణంగా ఈ ఏడాది అమెజాన్ 27 వేల మందిని ఇంటికి సాగనంపింది. మరోవైపు టీసీఎస్, విప్రో, హెచ్ సీఎల్ కంపెనీలు కూడా ఉద్యోగులు ఆఫీస్ కు రావాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే 50 శాతం వర్క్ ఫోర్స్ ఆఫీస్ కు వస్తున్నారని...పూర్తి స్థాయిలో రావాలని చెబుతున్నారు.

Updated : 22 July 2023 1:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top