Honor X9b: ఆహా.. ఏం ఫోన్ ఇది.. కిందపడ్డా డిస్ప్లే పగలదట.. ధర మరీ ఇంత తక్కువా?
X
లైఫ్ లో స్మార్ట్ ఫోన్ ఓ భాగం అయ్యాక.. ప్రతీ ఒక్కరి చేతిలో ఓ ఫోన్ ఉంటుంది. కావాల్సిన సమాచారం అంతా అరచేతిలోనే తెలుసుకోవచ్చు. వారి వారి స్థాయి, బడ్జెట్ ను బట్టి ఫోన్లు కొంటుంటారు. ఎంత రేటు పెట్టికొన్నా.. ఒకసారి పొరపాటున కింద పడితే డిస్ప్లే పగిలిపోవాల్సిందే. టెంపర్ గ్లాస్ ఉన్నా కొన్నిసార్లు డిస్ ప్లే డ్యామేజ్ అవుతుంది. అలాంటి సమయంలో గుండె బరువెక్కుతుంది. మళ్లీ వేల రూపాయలు పెట్టి కొత్త డిస్ ప్లే వేసుకుంటారు. అయితే ఇకపై ఆ సమస్య ఉండదు అంటోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హానర్. ఎందుకంటే.. హానర్ కొత్తగా తీసుకొచ్చిన ఎక్స్9బిని (Honor X9b) ఫోన్ లో.. యాంటీడ్రాప్ టెక్నాలజీని తీసుకొస్తుంది. దీంతో డిస్ ప్లే బ్రేక్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్‌ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ రాబోతుంది. దీనివల్ల ఫోన్ కింద పడినా డిస్‌ప్లేకు ఎలాంటి డ్యామేజ్ జరగదని కంపెనీ చెప్తోంది.
Honor X9b specifications:
➤ Honor X9b ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5కె రిజల్యూషన్, కర్వ్ డ్ అమోలెడ్ డిస్ ప్లే తో వస్తుంది.
➤క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13తో ఔటాఫ్‌ది బాక్స్ వస్తోంది.
➤ 5,800mah బ్యాటరీ.. 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
➤108 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా.. ఫ్రంట్ 16 ఎంపీ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్స్.
➤ ఈ ఫోన్ ధర 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ ఫోన్ అమెజాన్ లో అందుబాటులోకి రానుంది.