ఐఫోన్ యూజర్లకు అలర్ట్..చార్జింగ్ విషయంలో యాపిల్ హెచ్చరిక
X
వరల్డ్ ఫేమస్ టాప్ కంపెనీ యాపిల్ తన కస్టమర్లకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్ చార్జింగ్ పెట్టే విషయంలో కీలక సూచనలు జారీ చేసింది. ఫోన్‌కు చార్జింగ్ పెట్టి డైరెక్ట్‌గా వాడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి యూజర్లను హెచ్చరించింది. ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. అంతే కాదు ఐ ఫోన్ చార్జింగ్ పెట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చార్జింగ్ సమయంలో ఎలా ఉండాలి వంటి కొన్ని టిప్స్‌ను యూజర్లతో పంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్‌ను చార్జింగ్ పెట్టి ఫోన్ కాల్స్ అటెండ్ చేయకూడదని కంపెనీ తెలిపింది.
ఫోన్ చార్జింగ్‌లో పెట్టి మాట్లాడటం వల్లనే కాదు. చార్జింగ్ లో ఉన్నప్పుడు దాని పక్కన పడుకున్నా ప్రమాదమేనని హెచ్చరించింది. ఫోన్‌కు చార్జింగ్ పెట్టినప్పుడు మంది తెలియక ఫోన్‌ను పిల్లో కింద పెడుతుంటారు. చాలా మంది అలాగే పడుకుంటారు. ఆ సమయంలో ఫోన్ హీట్ అయి పేలిపోయే ప్రమాదం ఎక్కువని సూచించింది. ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని చెప్పింది.
ఐఫోన్‌లతో పాటు వచ్చే పవర్ అడాప్టర్‌లు, వైర్‌లెస్ చార్జర్‌లను ఎప్పుడు కూడా లైట్, ఎయిర్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలని యాపిల్ సంస్థ హెచ్చరిస్తుంది. మరీ ముఖ్యంగా ఒరిజినల్ ప్రాడక్ట్స్ కాకుండా థర్డ్-పార్టీ చార్జర్‌లను వినియోగించడం వల్ల ఐఫోన్ బాగా హీట్ అవుతుందని, కొన్ని సందర్భాల్లో పేలిపోవడం లేదా పని చేయకుండా అవుతుందని తెలిపింది. ఐఫోన్ కొనుగోలు చేసే సమయంలో కంపెనీ ఇచ్చే చార్జర్‌ను మాత్రమే వినియోగించాలని చెప్పింది. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి అని తెలిపింది. అదే విధంగా తడిగా ఉండే ప్రాంతాల్లో చార్జింగ్ కేబుల్స్, అడాప్టర్లు పెట్టడం వల్ల కరెంట్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉందని యాపిల్ సంస్థ యూజర్లను హెచ్చరించింది.