Home > టెక్నాలజీ > iPhone price drop: ఐఫోన్ 13,14 సిరీస్ ఫోన్ల ధర తగ్గినయ్

iPhone price drop: ఐఫోన్ 13,14 సిరీస్ ఫోన్ల ధర తగ్గినయ్

iPhone price drop: ఐఫోన్ 13,14 సిరీస్ ఫోన్ల ధర తగ్గినయ్
X

ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన, యూజర్లకు అవసరమైన కొత్త ఫీచర్లతో ఈ సిరీస్ ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యాపిల్ కీలక విషయం తీసుకుంది. ప్రతి ఏడాది కొత్త మోడల్ ఫోన్ తీసుకొచ్చే యాపిల్.. పాత మోడల్స్ ధరను తగ్గిస్తుంది. దాన్నే కొనసాగిస్తూ.. మార్కెట్ లో ఉన్న ఇతర ఐఫోన్ మోడల్ ధరను తగ్గించింది. ఒక్కో ఫోన్ పై దాదాపు రూ.10 వేలు తగ్గించింది. ఇకపై ఐఫోన్ 13,14 సిరీస్ లు తక్కువ ధరలో లభించనున్నాయి. ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్ ధర రూ.69,900లకు లభిస్తుంది. ఐఫోన్ 13 రూ. 59,900లకు అందుబాటులో ఉంది. మిగతా ఫోన్లు.. ఐఫోన్ 14 256జీబీ వేరియంట్ ధర రూ.79,900, 512జీబీ వేరియంట్ ధర రూ.99,900లకు తగ్గింది. వీటిని రూ.89,000, రూ,1,09,900లకు లాంచ్ చేసింది. ఐఫోన్ 14 ప్లస్ కూడా ఇప్పుడు రూ.79,900లకు పొందొచ్చు.








Updated : 13 Sept 2023 4:27 PM IST
Tags:    
Next Story
Share it
Top