యాపిల్ స్టోర్ లూటీ, ఐఫోన్ 15లతో పండగ చేసిన కుర్రోళ్లు.. వీడియో
X
యాపిల్ కంపెనీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసి ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ వస్తోంది.(Apple Iphone Store Loot ) బుకింగ్స్ వెల్లువెత్తున్నాయి. డబ్బులు ఉన్న ఉన్నోళ్లు కొనేస్తుంటే లేనివాళ్లు ఆశ వదిలేసుకుంటున్నారు. అమెరికాలోని కొందరు టీనేజ్ యువతీ యువకులు మాత్రం దోపిడీ చేశారు. ఫిలడెల్ఫియా నగరంలోని యాపిల్ కంపెనీ స్టోర్‌ను గుర్తుతెలియని యువతీ యువకులు టూటీ చేశారు. ముఖాలకు మాస్కులు కట్టుకుని వచ్చి దొరికిన వాటిని దొరికినట్లు దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళవారం రాత్రి సిటీ సెంటర్‌లోని యాపిల్, ఫుట్‌లాకర్, లులులెమోన్, చెస్ట్‌నట్ స్టోర్లలో లూటీ జరిగింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీలను ఎత్తుకెళ్లారు. పోలీసులు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. సీసీకెమెరాలు, ఇతర ఆధారాలతో 20మందిని అరెస్ట్ చేసి, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. దోచుకున్న ఫోన్లలో ఐఫోన్ 15 ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే యాంటీ థెఫ్ట్ ఫీచర్లు ఉండడంతో అవి పనిచేయక కొన్నిటిని రోడ్లపై విసిరేసోయారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు బలైనందుకు నిరసగానే ఈ లూటీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో గత నెల ఎడ్డీ ఇరిజారీ అనే 27 ఏళ్ల యువకుడిని ట్రాఫిక్ గొడవలో ఓ పోలీస్ అధికారి కాల్చిచంపాడు. అయితే ఆయన తప్పేమీ లేదని కోర్టు చెప్పింది. దీంతో యువత ఆగ్రహంతో లూటీకి పాల్పడి ఉంటారని వార్తలు వస్తున్నాయి.