Home > టెక్నాలజీ > ఈ చిన్న తప్పుతో లక్షల రూపాయలు నీళ్ల పాలు చేసినట్లవుతుంది

ఈ చిన్న తప్పుతో లక్షల రూపాయలు నీళ్ల పాలు చేసినట్లవుతుంది

ఈ చిన్న తప్పుతో లక్షల రూపాయలు నీళ్ల పాలు చేసినట్లవుతుంది
X

సెల్ ఫోన్ పొరపాటున నీళ్లల్లో పడితే.. తీసుకెళ్లి బియ్యం సంచిలో పెట్టడం చాలామందికి అలవాటే. అలా ఒకరోజంతా బియ్యం బస్తాలో ఉంచి.. తర్వాత రోజు చార్జింగ్ పెట్టి వాడుకుంటారు. ఇంకా ఫోన్ లోని నీళ్లను పోగొట్టేందుకు ఇలాంలి సొంత ప్రయత్నాలు చాలా చేస్తుంటారు. ఇలా చేస్తే ఫోన్ మరింత దెబ్బతినే అవకాశం ఉందని యాపిల్ కంపెనీ హెచ్చరిస్తుంది. ‘నీళ్లలో పడ్డ ఐఫోన్ ను ఎట్టిపరిస్థితిలోనూ బియ్యం సంచిలో పెట్టొద్దు. అలా చేస్తే ఫోన్ ఇంకా దెబ్బతింటుంది. బియ్యంలోని సూక్ష్మ రేణువులు ఫోన్ లోకి వెళ్లి మరింత పాడు చేస్తాయ’ని కంపెనీ తెలిపింది. నీళ్లలో పడ్డప్పుడు.. ‘కనెక్టర్ కిందికి ఉండేలా ఫోన్ ను పట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా చేతితో ఫోన్ పై భాగాన కొట్టాలి. తర్వాత ఫోన్ పొడిగా ఉండే ప్లేస్ లో పెట్టి.. ఒక 30 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాతే.. చార్జింగ్ పెట్టాలి. లేదా కొన్నిసార్లు నీళ్లు పోవడానికి 24 గంటల టైం పట్టొచ్చు. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ ద్వారా ఫోన్ పరిస్థితిని తెలుసుకోవచ్చ’ని యాపిల్ తెలిపింది.


Updated : 20 Feb 2024 6:17 PM IST
Tags:    
Next Story
Share it
Top