Home > టెక్నాలజీ > Costly Coffee : ఈ కాఫీ గురించి తెలిస్తే ఛీ యాక్ అనాల్సిందే

Costly Coffee : ఈ కాఫీ గురించి తెలిస్తే ఛీ యాక్ అనాల్సిందే

Costly Coffee : ఈ కాఫీ గురించి తెలిస్తే ఛీ యాక్ అనాల్సిందే
X

కాఫీ వాసన తగలనిదే...ఒక్క గుక్క లోపలికి వెళ్ళనిదే తెల్లారదు చాలామందికి. కాఫీ తాగనిదే ఉండలేరు చాలా మంది. ప్రపంచంలో చాలా వెరైటీ కాఫీలున్నాయి.అలాగే ఖరీదైనవి కూడా. ఇలాంటి కాస్ట్లీ కాఫీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆ ఒక కప్పు కాఫీ ఖరీదు 6వేల రూపాయలు. కానీ దాన్ని దేంతో తయారు చేస్తారో తెలుసుకుంటే మాత్రం ఛీ యాక్ అంటారు.

ఈ కాఫీ ఆసియా దేశాల్లోనే దొరుకుతుంది. మన దక్షిణ భారతదేశంలో కూడా ఇది లభ్యమవుతుందిట. కానీ చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకే దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఈ కాఫీని దేంతో తయారు చేస్తారో తెలుసా...పిల్లి మలంతో. ఏంటీ....ఏం చెప్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా...నిజంగా నిజం. అత్యంత ఖరీదైన, అరుదైన కాఫీగా చెప్పబడే కోఫిలువాక్ అనే కాఫీ పిల్లి మలంతోనే తయారు చేస్తారు. దీని వెనుక పెద్ద రీజనే చెబుతున్నారు కూడా.

కోఫిలువాక్ ని సీవెట్ కాఫీ అని కూడా అంటారు. సీవెట్ అనేది ఒక పిల్లి జాతి పేరు. ఈ జాతి పిల్లికి పెద్ద తోక ఉంటుంది. దీనికి కాఫీ గింజలు తినడం అంటే చాలా ఇష్టంట. మామూలుగా కాఫీ చెర్రీస్ తింటే జీర్ణమయిపోతాయి. కానీ పిల్లుల ప్రేగుల్లో జీర్ణ ఎంజైములు ఉండవు. అందుకే కాఫీ చెర్రీలను పిల్లులు పూర్తి జీర్ణం చేసుకోలేవు. ఇలా సరిగ్గా జీర్ణం కానీ మిగతా భాగాన్ని సివెట్ పిల్లి తన మలం నుంచి బయటకు పంపించేస్తుంది. అలా బయటకు వచ్చిన కాఫీ మలంతోనే కోఫిలువాక్ కాఫీని తయారు చేస్తారు.

ఎలా చేస్తారు అంటే....

ముందుగా జీర్ణం కానీ కాఫీ గింజలను మలం నుంచి వేరుచేస్తారు. క్రిములు లేకుండా బాగా శుభ్రం చేస్తారు.తరువాత వాటిని బాగా కడిగి, ఆరబెట్టి...పొడిచేస్తారు. ఇలా వచ్చిన వాటితో కాఫీ ఎందుకు పెట్టుకోవడం, డైరెక్ట్ గా కాఫీ గింజలతోనే చేస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారా.... అక్కడికే వస్తున్నా. కాఫీ గింజలు పిల్లి పేగుల గుండా వెళ్ళిన తర్వాత అవి దాని జీర్ణ ఎంజైములతో కలిసి కాఫీని మరింత మెరుగ్గా , పోషకవిలువలతో కూడినవిగా చేస్తాయిట. అందుకే వాటికి రుచీ పెరుగుతుంది, అలాగే ఆరోగ్యం కూడాను.

అయితే సీవెట్ పిల్లులు ఎక్కువగా ఉండవు. ఇదొక అరుదైన జాతికి చెందిన పిల్లి. అందుకే ఈ పిల్లి కాఫీ అంత ఖరీదు. పైగా ప్రాసెస్ కూడా ఎక్కువ అంటున్నారు దీని తయారీదారులు. ఏది ఏమైనా కోఫిలువాక్ తెలియకుండా తాగితే ఓకే కానీ తెలిసాక తాగగలమంటారా....

Updated : 8 Aug 2023 2:55 PM IST
Tags:    
Next Story
Share it
Top