NASA : టెన్షన్ టెన్షన్.. భూమిపైకి దూసుకొస్తోన్న గ్రహశకలం
X
(NASA) అంతరిక్షంలో గ్రహాలు, గ్రహశకలాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని గ్రహ శకలాలు మాత్రం అప్పుడప్పుడూ భూమి వైపు దూసుకొస్తుంటాయి. అందులో కొన్ని భూమిని ఢీకొనేందుకు వచ్చినప్పుడు అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటి దిశను మారుస్తుంటారు. అలా భూమికి ఏం కాకుండా వాళ్లు చూస్తారు. అయితే తాజాగా అతి ప్రమాదకరమైన ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహ శకలంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా శాస్త్రవేత్తలు ఒక క్లారిటీ ఇచ్చారు.
నిరంతరం నిఘా
గ్రహశకలాలు సౌర కుటుంబం నుంచి భూమి వైపు వస్తుంటాయి. అందులో కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు శకలాలపై నిఘా ఉంచారు. కొన్ని ప్రమాదకర గ్రహ శకలాల వల్ల భూమి బద్దలయ్యే అవకాశం కూడా ఉందని, అయితే అలాంటి పరిస్థితి ఇప్పటి వరకూ రాలేదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం భూమి వైపు ప్రయాణిస్తున్న ఆ గ్రహశకలం ఫుట్‌బాట్ పిచ్ సైజులో ఉందని, అది భూమిని ఢీకొట్టే పరిస్థితి లేదని నాసా శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు.
2350 ప్రమాదకర గ్రహశకలాలు
భూమి వైపు వస్తున్న ఆ గ్రహశకలం దాదాపుగా 890 అడుగుల వ్యాసంతో ఉంటుందని, అది భూమికి అత్యంత దగ్గరగా వెళ్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహశకలానికి 2008 OS7 అనే పేరును పెట్టారు. మొదట ఆ ప్రమాదకర గ్రహశకలం గురించి శాస్త్రవేత్తలు టెన్షన్ పడినప్పటికీ ఆ తర్వాత దాని గమనాన్ని తెలుసుకున్నారు. ఆఖరికి ఆ గ్రహశకలం భూమి వాతావరణంలోకి ప్రవేశించదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అంతరిక్షంలో ప్రస్తుతం 2350 ప్రమాదకర గ్రహశకలాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని గ్రహశకలాలు భూమి వైపు రాకుండా దిశను మార్చినట్లు వెల్లడించారు.