Home > టెక్నాలజీ > ఎలక్ట్రిక్ కార్లకు BMW గుడ్ బై.. ఆ వాహనాలపై స్పెషల్ ఫోకస్..!

ఎలక్ట్రిక్ కార్లకు BMW గుడ్ బై.. ఆ వాహనాలపై స్పెషల్ ఫోకస్..!

ఎలక్ట్రిక్ కార్లకు BMW గుడ్ బై.. ఆ వాహనాలపై స్పెషల్ ఫోకస్..!
X

పెట్రోల్, డీజిల్ వాహనాల ట్రెండ్ అయిపోయింది. ప్రస్తుతం అంతా ఈవీ వాహనాలదే ట్రెండ్. కంపెనీలు సైతం దీనిని క్యాష్ చేసుకుంటూ భారీగా ఈవీ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. 2030 నాటికి మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడవనుంది. 2022 నాటికి యూఎస్లో 2.5 మిలియన్ ఈవీ వాహనాలు వినియోగంలో ఉంటే.. హైడ్రోజన్ వాహనాలు 15వేలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ధీటుగా హైడ్రోజన్ కార్లు మార్కెట్లోకి వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

నీటి ఆవిరిని మాత్రమే రిలీజ్ చేస్తాయి

ఈవీ వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాల వల్ల పర్యావరణానికి మరింత మేలు ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలను ఉపయోగిస్తే అవి మాత్రం హైడ్రోజన్ వాయువుతో నడస్తాయి. హైడ్రోజన్ వాడకంతో కాలుష్యాన్ని చాలావరకు తగ్గించవచ్చు. వీటి వల్ల నీటి ఆవిరి మాత్రమే రిలీజ్ అవుతోంది. దీంతో పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. రానున్న రోజుల్లో ఈవీ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ వాహనాలు మార్కెట్లో సత్తా చాటనున్నాయి.

ఈ క్రమంలో దిగ్గజ కంపెనీలు సైతం హైడ్రోజన్ కార్ల తయారీ బాట పట్టాయి.

బీఎండబ్ల్యూ ఫోకస్

ఈ కంపెనీల లిస్ట్లో బీఎండబ్ల్యూ చేరింది. 2025 నాటికి హైడ్రోజన్ కార్లను మార్కెట్లోకి తేవాలని బీఎండబ్ల్యూ భావిస్తోంది. BMW iX5 వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. వాతావరణంలో హైడ్రోజన్ సమృద్ధిగా లభించడం వల్ల త్వరలోనే భారీ సంఖ్యలో హైడ్రోజన్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు బీఎండబ్ల్యు చర్యలు చేపట్టింది. అయితే రిఫ్యూయలింగ్ స్టేషన్లు వీటికి సవాల్ గా మారిన.. దానిని అధిగమించేందుకు కంపెనీలు ప్రణాళకలు రచిస్తున్నాయి.

Updated : 30 Jan 2024 9:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top