జియో e-సిమ్‌తో స్మార్ట్‌వాచ్ - ఇక మొబైల్‌తో పనే లేదు! ధర ఎంతంటే?
X
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భాగస్వామ్యంతో.. బోట్ సంస్థ ‘లూనార్ ప్రో ఎల్టీఈ’ స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తుంది. త్వరలో ఈ వాచ్ లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. దేశీయంగా ఇ-సిమ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఇండియన్ బ్రాండ్ తమదేనని బోట్ తెలిపింది. ఇ సిమ్ వస్తుండటంతో.. ఈ స్మార్ట్ వాచ్ ఫోన్ లా పనిచేస్తుందని.. వాచ్ నుంచే కాల్స్, మెసేజ్ లు చేసుకోవచ్చని పేర్కొంది. దీని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయంటే..
ఇందులో ఇన్ బిల్ట్ జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంటుంది. రెగ్యులర్ స్మార్ట్‌వాచ్‌లలో ఉన్నట్లే యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిట్‌నెస్ ట్రాకర్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ హెల్త్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. 1.39 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఇందులో ప్లస్ పాయింట్. సన్ లైట్ లోనూ డిస్ ప్టేను క్లియర్ గా చూడొచ్చు. త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఈ స్మార్ట్ వాచ్.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటుందని బోట్ తెలిపింది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, 577 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ డేట్, ప్రైస్ మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.