BSNL బంపర్ ఆఫర్.. ఆందోళనలో ఎయిర్టెల్,జియో..
X
దేశంలో టెలికాం సంస్థల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా జియో - ఎయిర్ టెల్ మధ్య రిఛార్జ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆ రెండింటికి షాక్ ఇస్తూ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే రిఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. 139 ప్లాన్ తో ఇతర కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ ఝలక్ ఇచ్చింది.
వినియోగదారులు 139తో రిఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్‌కు 28 రోజుల కాలపరిమితి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్లో అత్యుత్తమ ప్లాన్లలో ఒకటిగా ఉన్న ఈ ప్లాన్ గడువు 28 రోజులు. జియో, ఎయిర్టెల్ సంస్థలు ఇదే ఆఫర్ ను దీనికి రెట్టింపు ధరకు ఇస్తుండడం గమనార్హం.
బీఎస్ఎన్ఎల్ చౌక రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో మరొక అద్భుతమైన ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ప్లాన్ ధర రూ.149. కస్టమర్లు ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.50 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 SMSలు పొందుతారు. 139 ప్లాన్‌లో మాత్రం 100 SMSలు అందుబాటులో ఉండవు. మరొకవైపు త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని ఇటీవల కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.