Bsnl: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ. 397కే 5 నెలలు వ్యాలిడీ..
X
కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) బంపర్ ప్లాన్ తీసుకొచ్చింది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునేవారికి ప్రస్తుతం దీనికి మించిన ప్లాన్ లేనట్లే. రూ. 397కే 5 నెలల వ్యాలిడిటీతో ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. కాకపోతే ఈ ప్రయోజనాలు కేవలం 30 రోజుల మాత్రమే. తర్వాత నాలుగు నెలలు కూడ వాలిడిటీ ఉంటుంది.
నిజానికి ఇది పాత ప్లానే. గతంలో 180 రోజుల వాలిడిటీ ఉండగా ఇప్పుడు 150 రోజులకు తగ్గించారు. గతంలో అన్ లిమిటెడ్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ప్రయోజనం 60 నెలలుగా ఉండగా దీన్ని ప్రస్తుత ప్లాన్‌లో 30 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. సుదీర్ఘ వ్యాలిడిటీతోపాటు డబుల్ సిమ్‌లలో రెండో సిమ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి ఆ ప్లాన్ ఉపయోగకరం. డేటా, ఔట్ గోయింగ్ కాల్స్ అక్కర్లేని వారికి ప్రయోజనం ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్ సహా అన్ని ప్రైవేటు కంపెనీలు నెల వాలిడిటీ ప్లాన్లు రూ. 250 నుంచి రూ. 300లకు పైనే అమ్ముతున్నాయి. డేటా, కాల్స్ విషయంలో పరిమితులు ఉండవు. వ్యాలిడిటీ మాత్రమే కావాలంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్లకు మొగ్గుచూపొచ్చు.