Home > టెక్నాలజీ > లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3

లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3

లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3
X

140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలతో నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ -3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. చంద్రునికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే చంద్రయాన్ -3 ఉంది. దీంతో మరో కీలక ఘట్టానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మరో వారం రోజుల్లో చంద్రయాన్‌-3 విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. ప్రస్తుతం భారత వ్యోమనౌక చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లుx163 కిలో మీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్ట్ 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ ఆగస్టు 17న విడిపోతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. క్రమంగా ల్యాండర్‌ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.

భారతదేశం తన ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న చంద్రునిపైకి ప్రారంభించింది. ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, భారీ ప్రయోగం ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.613 కోట్ల ఖర్చుచేశారు.చంద్రయాన్‌-3 దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. అదే విధంగా అమెరికా, రష్యా , చైనాలు తర్వాత సాప్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. భారత్ కు పోటీగా ఆగస్టు 11న చంద్రుడిపైకి లునా-25 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. నాలుగేళ్ల కిందట భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే.

Updated : 16 Aug 2023 1:56 PM IST
Tags:    
Next Story
Share it
Top