Home > టెక్నాలజీ > జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్-3.. ఫోటోలు పంపిన ల్యాండర్

జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్-3.. ఫోటోలు పంపిన ల్యాండర్

జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్-3.. ఫోటోలు పంపిన ల్యాండర్
X

ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3.. చివరి అంకానికి చేరుకుంది. చంద్రుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన ల్యాండర్ 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను తీసి పంపింది. ఈ ఫొటోలను ఇస్రో

ట్విట్టర్‌ లో పోస్టు చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది.

చంద్రయాన్‌-3 సేఫ్ ల్యాండింగ్‌ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై కాలు మోపనుంది

Updated : 22 Aug 2023 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top