చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనున్న ISRO
X
ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. చారిత్రక ఘట్టానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. జాబిల్లిపై చంద్రయాన్- 3 కాలుమేపేందుకు రెడీ అయ్యింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ చంద్రుడిపై అడుగువేయబోతోంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే ముందుగా చంద్రయాన్-3 ని ఇదే రోజు సాయంత్రం 5.47 గంటలకు ట్యాండ్ చేయాలని ISRO నిర్ణయించింది. అయితే, తాజాగా ఈ టైమింగ్‌లో మార్పు చేపింది. ముందుగా అనుకున్న సమయానికన్నా 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా రష్యా ప్రయోగించిన లూనా-25 ఫెయిల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు చంద్రయాన్-3పై పడింది.
ఈ ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్ ప్రక్రియ సక్సెస్ అయ్యింది. దీంతో ఆదివారం ల్యాండర్ స్వీడ్ను తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ పనితో ల్యాండర్ జాబిల్లికి మరింతగా దగ్గరైంది.ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ 25 x 134 కి.మీ.ల కక్ష్యలో రొటేట్ అవుతోంది. ఇక్కడి నుంచే ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు అన్ని సన్నాహాలు చేసింది ఇస్రో.
అంతరిక్ష పరిశోధనల్లో దేశం గర్వించే ప్రయోగాన్ని చేస్తోంది ఇస్రో. ఈ నేపథ్యంలో ఇస్రో సాధించిన పురోగతిని భారతీయులందరూ చూసేందుకు వీలుగా ఇస్రో ప్రణాళికలు చేస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్-3 కాలుమోపే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసేవిధంగా ఆ దృష్యాలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్‌ను స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ISRO వెల్లడించింది. ఇస్రోకు సంబంధించిన వెబ్‌సైట్, య్యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, డీడీ నేషనల్ ఛానల్‌లో ఈ అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. అంతే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్‌లో లైవ్‌స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.
Chandrayaan-3 Mission:
🇮🇳Chandrayaan-3 is set to land on the moon 🌖on August 23, 2023, around 18:04 Hrs. IST.
— ISRO (@isro) August 20, 2023
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together
as the action unfolds LIVE at:
ISRO Website https://t.co/osrHMk7MZL
YouTube… pic.twitter.com/zyu1sdVpoE