Home > టెక్నాలజీ > Chandrayaan-3 Mission : జాబిల్లిపై సెంచరీ కొట్టిన రోవర్.. కొనసాగుతున్న శోధన...

Chandrayaan-3 Mission : జాబిల్లిపై సెంచరీ కొట్టిన రోవర్.. కొనసాగుతున్న శోధన...

Chandrayaan-3 Mission : జాబిల్లిపై సెంచరీ కొట్టిన రోవర్.. కొనసాగుతున్న శోధన...
X

ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం సాఫీగా సాగుతోంది. జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ్యాన్ రోవర్ తమ పనిని కొనసాగిస్తున్నాయి. రోవర్ పంపిన డేటాతో చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు ఇస్రో గుర్తించింది. దీంతోపాటు పలు ఖనిజాలను కనుగొన్న రోవర్.. మాంగనీస్, సిలికాన్, హైడ్రోజన్, అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఐరన్, క్రోమియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది.





జాబిల్లపై రోవర్ 100 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్‌ నుంచి ఇప్పటికే 100 మీటర్ల దూరం ప్రయాణించిన రోవర్.. మరింత ముందుకు వెళ్తున్నట్లు చెప్పింది. రోవర్‌ ప్రయాణించిన దూరానికి సంబంధించిన ఫొటోను ఇస్రో ట్వీట్ చేసింది. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌ సెంచరీ కొట్టినట్లు ఈ ట్వీట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

మరోవైపు చం‍ద్రయాన్‌-3 మిషన్‌ చివరి దశకు చేరుకుంది.. చంద్రుడిపై పగటి (14 రోజులు) గడువు సమీపిస్తుండటంతో ఇస్రో అప్రమత్తమైంది. సూర్యకాంతి తగ్గి పోతుండడంతో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్‌ రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచడానికి ప్రయత్నాలు షురూ చేసింది. ఈ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అనుకున్నట్లుగానే పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.




Updated : 2 Sept 2023 3:48 PM IST
Tags:    
Next Story
Share it
Top