Home > టెక్నాలజీ > విక్ర‌మ్ ల్యాండ‌ర్ తీసిన జాబిల్లి చిత్రాలు.. ఇస్రో ట్వీట్

విక్ర‌మ్ ల్యాండ‌ర్ తీసిన జాబిల్లి చిత్రాలు.. ఇస్రో ట్వీట్

విక్ర‌మ్ ల్యాండ‌ర్ తీసిన జాబిల్లి చిత్రాలు.. ఇస్రో ట్వీట్
X

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్లిన చంద్రయాన్ -3.. జాబిల్లిపై అడుగుపెట్టింది. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని దక్షిణ ధృవంపై 6.03 గంటలకు కాలుమోపి మోపి భారత్ సత్తాను విశ్వానికి చాటి చెప్పింది. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, చైనాలకు అందని ద్రాక్షలా ఉన్న ఈ ప్రయోగాన్ని భారత్ చేసి చూపెట్టింది. జాబిల్లిపై అడుగుపెట్టగానే విక్రమ్ ల్యాండర్ తన పని మొదలుపెట్టింది. జాబిల్లిపై కాలు మోపిన కొద్ది నిమిషాల్లోనే భూమిపై ఉన్న స్పేస్ సెంటర్ తో కమ్యూనికేట్ అయింది. చందమామపై తాజాగా తీసిన తొలి ఫొటోలను పంపించింది. ఈ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తుంది:

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధృవంలో నీటి జాడలను గుర్తిస్తాయి. అలాగే సూర్య కుటుంబం, భూమి, చంద్రుని పుట్టుకల రహస్యాలు, చంద్రుడు ఏర్పడినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అన్న విషయాలను తెలుసుకునేందుకు వీలుంటుంది. చంద్రుడి భౌగోళిక స్వరూపం, లక్షణాలతో పాటు దక్షిణ ధృవం సమీపంలో గడ్డ కట్టిన మట్టిలో దాగివున్న అనేక రహస్యాలను విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు వెలుగులోకి తీసుకొస్తాయి.

Updated : 23 Aug 2023 5:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top