ఇటలీ టెలిస్కోప్‌కు చిక్కిన చంద్రయాన్-3
X
జాబిల్లి లక్ష్యంగా చంద్రయాన్ 3 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఈ మిషన్ కక్ష్యను ఇస్రో మూడోసారి విజయవంతంగా పెంచింది. ఇస్రో పంపిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం భూమికి 41,762km X 173 కి.మీ. కక్ష్యలో తిరుగుతోంది. ఈ నెల 20న మధ్యాహ్నం 2-3 గంటల మధ్య మరోమారు దాని కక్ష్యను పెంచనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇలా స్పేస్ క్రాఫ్ట్ ఎత్తును పెంచుకుంటూ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లిన తర్వాత ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ చేస్తారు. ఆ రోజు కోసమే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. చంద్రయాన్-3ని ఇటలీలోని మనాసియానోలో ఉన్న వర్చువల్ టెలిస్కోప్ వీడియో తీసి విడుదల చేసింది. రియల్‌టైమ్ కవరేజీకి పేరుగాంచిన ఈ టెలిస్కోప్ ప్రాజెక్టు విడుదల చేసిన వీడియోలో చంద్రయాన్-3 ఓ చుక్కలా మెరుస్తూ కనిపిస్తున్నది.
We observed the #Chandrayaan3 spacecraft again last night! Furthermore, we created a time-lapse using our 15 July data. 🛰️🔭📷 @isro
More here ⬇️⬇️⬇️
— Virtual Telescope (@VirtualTelescop) July 17, 2023
🛑https://t.co/tyaHC13RBl pic.twitter.com/RFa87CPdxP