Home > టెక్నాలజీ > విక్రమ్ దిగుతుండగా చంద్రుడు ఇలా కనిపించాడు.. వీడియో

విక్రమ్ దిగుతుండగా చంద్రుడు ఇలా కనిపించాడు.. వీడియో

విక్రమ్ దిగుతుండగా చంద్రుడు ఇలా కనిపించాడు.. వీడియో
X

భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగిన విక్రమ్ మాడ్యూల్ ల్యాండ్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ రోవర్ సజావుగా పనిచేస్తోంది. ప్రజ్ఞాన్ జాబిల్లిపై నడవడం మొదలుపెట్టిందని ఇస్రో తెలిపింది. బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు రోవర్‌కు మధ్య కమ్యూనికేషన ఏర్పడిందని, అన్నీ షెడ్యూలు ప్రకారమే సజావుగా సాగుతున్నాయని తెలిపింది.

విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి జారుతుండగా కనిపించిన చంద్రుడి దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఇస్రో షేర్ చేసింది. ధూళి వల్ల రోవర్ డ్యామేజ్ కాకూడదని ఇస్రో మూడుగంటల పాటు విరామం ఇచ్చిన తర్వాత రోవర్‌ను బయటికి కమాండ్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. విక్రమ్ బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు దిగగా 9:04 నిమిషాలకు రోవర్‌ను బయటికి తీసుకొచ్చారు. విక్రమ్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పనిచేస్తున్నాయని ఇస్రో తెలిపింది. ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్సపరిమెంట్ తమకు నిర్దేశించిన పనులును ప్రారంభించాయని త్వరలోనే డేటా వస్తుందని వెల్లడించింవది.

Updated : 24 Aug 2023 9:43 PM IST
Tags:    
Next Story
Share it
Top