Home > టెక్నాలజీ > Chandrayaan 3 : గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. మళ్లీ పనిచేస్తున్న చంద్రయాన్ 3..

Chandrayaan 3 : గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. మళ్లీ పనిచేస్తున్న చంద్రయాన్ 3..

Chandrayaan 3 : గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. మళ్లీ పనిచేస్తున్న చంద్రయాన్ 3..
X

చంద్రయాన్‌-3 మిషన్‌కు భారత అంతరిక్ష సంస్థ.. ఇస్రో గుడ్ న్యూస్ చెప్పింది. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ చంద్రయాన్ 3లోని పరికరాలు పనిచేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రుని దక్షిణ ధృవనం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. రాత్రి సమయాల్లో అక్కడి ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 డిగ్రీలకు తగ్గుతుంది. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు అసాధ్యం కావడంతో ఇస్రో సైంటిస్టులు గతేడాది సెప్టెంబర్ 2న రోవన్, 4న ల్యాండర్ ను స్లీప్ మోడ్ లోకి పంపారు.

తాజాగా చంద్రయాన్‌-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ)ను అమర్చారు. ఇందులో ఉన్న లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే (ఎల్‌ఆర్‌ఏ).. చంద్రుని దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని సైంటిస్టులు చెప్పారు. డిసెంబరు 12 నుంచి ఎల్‌ఆర్‌ఏ నుంచి తమకు సంకేతాలు అందుతున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది.

చంద్రయాన్‌-3లో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ మాత్రమే పని చేస్తోంది. దక్షిణ ధ్రువంలో రాత్రి సమయంలో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ మొదలవుతుంది. చంద్రయాన్‌-3 నుంచి తూర్పు వైపునకు మళ్లి ఉన్న ఎల్‌ఆర్‌ఓలోని లేజర్‌ అల్టిమీటర్‌ (లోలా) చంద్రయాన్‌-3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. చంద్రయాన్‌-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేండ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే ఛాన్సుందని ఇస్రో వర్గాలు చెప్పాయి.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్ గతేడాది ఆగస్టు 23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయింది. ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్‌ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజుల పాటు అక్కడి వాతావరణం, నీటి లభ్యత, ఖనిజాల గురించి అధ్యయనం చేసి ఇస్రోకు కీలక సమాచారం అందజేసింది.




Updated : 20 Jan 2024 11:42 AM IST
Tags:    
Next Story
Share it
Top