చంద్రయాన్-3 ద్వారా ఇస్రోకు రూ. 363 కోట్లు ఆదా
X
భూమికి 3.84 లక్షల కి.మీల దూరంలో ఉన్న చంద్ర మండలాన్ని చేరుకొనేందుకు ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్.... చంద్రయాన్-3ను శుక్రవారం (జులై 14) ప్రయోగించింది ఇస్రో. నెల్లూరులోని శ్రీహరి కోట స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించే రాకెట్ లక్ష్యం.. చంద్రున్ని లోతుగా పరిశీలించడమే. చంద్రుని వెనకవైపున్న దక్షిణ భాగ రహస్యాల్ని వెలికి తీయడమే. ఈ భాగంలో సూర్యుడు పడడు. దాంతో ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తులో అక్కడ నివాసం ఉండొచ్చో లేదో తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. అమెరికా, చైనాలను సాధ్యం కాని విషయాన్ని భారత్ చేసినట్లు అవుతుంది. అయితే, చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా ఇస్రో రూ.363 కోట్లు ఆదా చేసిందని అంటున్నారు.
2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగంలో ఉపయోగించిన ఆర్బిటర్.. అప్పటి నుంచి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. దాంతో చంద్రయాన్-3లో కొత్త ఆర్బిటర్ ను పంపలేదు. దీనివల్ల ఇస్రోకు రూ.363 కోట్లు ఆదా అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రయాన్-3 తయారీకి రూ.375 కోట్లు, ఉపగ్రహానికి రూ.240 కోట్లు ఖర్చు అయ్యాయి. 2019లో పంపిన ఆర్బిటర్ బరువు 2,379 కేజీలు. అది ఇప్పటికీ చంద్రుని చుట్టూ తిరుగుతూ.. ఉపరితలాన్ని స్కాన్ చేస్తోంది. ల్యాండర్ తో కమ్యూనికేషన్ కావడానికి కూడా ఆర్బిటర్ అవసరం అవుతుంది.