Home > టెక్నాలజీ > జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. గాల్లోకి లేచిన 2 టన్నుల దుమ్ము..

జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. గాల్లోకి లేచిన 2 టన్నుల దుమ్ము..

జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. గాల్లోకి లేచిన 2 టన్నుల దుమ్ము..
X

ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 దుమ్ములేపింది. విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండ్ అయిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి గాల్లోకి లేచినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఆ ప్రదేశమంతా ప్రకాశవంతంగా కనిపిస్తుండగా.. దీన్ని ‘ఎజెక్టా హలోగా పేర్కొంటూ ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుడి కక్ష్యలోనే ఉన్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్‌ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని విశ్లేషించారు.

ల్యాండింగ్‌కు కొద్ది గంటల ముందు.. ఆ తర్వాత ఆర్బిటార్ తీసిన ఫొటోలను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. విక్రమ్‌ ల్యాండర్ ల్యాండ్ అయ్యేటప్పుడు డిసెంట్‌ స్టేజ్‌ రాకెట్ల కారణంగా జాబిల్లి ఉపరితలంపై భారీగా దుమ్ము పైకి లేచినట్లు తేల్చారు. దీన్ని ఫలితంగా అక్కడ 108.4 మీటర్ల విస్తీర్ణంలో మట్టి చెల్లాచెదురైనట్లు శాస్త్రవేత్తలు వివరించింది. ఈ పరిణామంతో చంద్రుడి ధూళి స్పందించే తీరును తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.

కాగా జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టగా.. అగస్ట్ 23న చంద్రడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత దానిలోని రోవర్ బయటకు వచ్చి తమ పనిని పూర్తిచేశాయి.

చంద్రుడిపై రాత్రి కావడంతో సెప్టెంబర్ 3న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపించింది. ఇక అప్పటి నుంచి ల్యాండర్, రోవర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు.


Updated : 28 Oct 2023 8:47 AM IST
Tags:    
Next Story
Share it
Top