Home > టెక్నాలజీ > Chandrayaan-4: ISRO : చంద్రయాన్‌-4 .. ఇస్రో ఏం చేయబోతుందంటే..

Chandrayaan-4: ISRO : చంద్రయాన్‌-4 .. ఇస్రో ఏం చేయబోతుందంటే..

Chandrayaan-4: ISRO : చంద్రయాన్‌-4 .. ఇస్రో ఏం చేయబోతుందంటే..
X

చంద్రయాన్‌ -3 ప్రయోగం సక్సెస్‌ కావడంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో).. ఇక చంద్రయాన్-4కు సిద్ధమవుతోంది. చంద్రయాన్-4 , లూపెక్స్‌ మిషన్లతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో జాబిల్లి పైనుంచి మట్టి నమూనాలు, రాళ్లను భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్‌ సెంటర్‌ డైరెక్టర్ నీల్ దేశాయ్‌ పుణెలో పలు విషయాలు వెల్లడించారు. జాబిల్లి ఉపరితలంపై లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌(లూపెక్స్)ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అయితే చంద్రయాన్-3లోని ల్యాండర్.. దక్షిణ ధ్రువంపై దాదాపు 70 డిగ్రీల అక్షాంశం వద్ద దిగిందని.. చంద్రయాన్‌-4లో మాత్రం 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగుతుందని పేర్కొన్నారు.

అలాగే చంద్రయాన్‌-3లో 30 కిలోల బరువున్న రోవర్‌ను పంపామని.. చంద్రయాన్‌-4లో 350 కిలోల బరువున్న రోవర్‌ను పంపనున్నామని తెలిపారు. ఇది చంద్రునిపై ఒక కిలోమీటరు వరకు తిరిగుతుందని చెప్పారు. చంద్రయాన్-3 మిషన్‌ కేవలం 14 రోజులు మాత్రమే పనిచేయగా.. చంద్రయాన్-4 మాత్రం సుమారు 100 రోజుల వరకు పనిచేస్తుందని అన్నారు. ఈ సమయంలోనే రోవల్‌లో ఉన్న పరికరాలు జాబిల్లిపై ఉన్న మట్టిని, రాళ్లను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయని తెలిపారు. అయితే ఈ చంద్రయాన్-4 ప్రాజెక్టు కోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో ఈ ప్రయోగాన్ని చేపడతామని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రయోగం కోసం ఇస్రో.. జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తుందని.. నీల్ దేశాయ్ వెల్లడించారు.




Updated : 20 Nov 2023 10:10 AM IST
Tags:    
Next Story
Share it
Top