Home > టెక్నాలజీ > ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ చాట్‎జీపీటీ యాప్

ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ చాట్‎జీపీటీ యాప్

ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ చాట్‎జీపీటీ యాప్
X

ChatGPT ఆండ్రాయిడ్ యాప్ సేవలు భారతదేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందు, ఈ యాప్ కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు, అందరు Android వినియోగదారులు Google Play యాప్ స్టోర్ నుండి ChatGPTని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మంగళవారం రాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత్ తో పాటు అమెరికా, బంగ్లాదేశ్ , బ్రెజిల్ దేశాల్లోనూ ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. OpenAI తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మరో వారంలో ChatGPT సేవలు మరిన్ని దేశాల్లోనూ విస్తరించే ప్లాన్‎లో ఉంది. ఐఓఎస్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన రెండు నెలల తర్వాత చాట్‌జీపీటీ సేవలు ఆండ్రాయిడ్‎లో అందుబాటులోకి వచ్చాయి.

చాలా సులువుగా ChatGPT యాప్‎ను డౌన్‎లోడ్ చేసి ఉపయోగించుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్ లో చాట్‌జీపీటీ యాప్‎ను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు. అయితే, ChatGPT పేరుతో ఉన్న అనేక యాప్‌లు ఉన్నాయి. వినియోగదారులు పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో యూజర్లు అధికారిక డెవలపర్ OpenAI ను ఆశ్రయించాల్సి ఉంటుంది.

ఒక్కసారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, రిజిస్టర్డ్ ఐడీతో లాగిన్ కావాలి. మీరు ChatGPTకి కొత్త అయితే, మీ ఆపిల్ లేదా గూగుల్ ఐడీతో సైన్ అప్ చేయవచ్చు.

ఈ యాప్‎లో వాయిస్‌ సెర్చింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఏవైనా సలహాలు, సమాధానాల కోసం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు చాట్‌ హిస్టరీ, డేటా ఎక్స్‌పోర్ట్ చేసే ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. అయితే ఐఫోన్‌లో యూజర్లకు అందించే ప్లగిన్ వంటి ఫీచర్లు మాత్రం ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇంకా తీసుకురాలేదు. వివిధ డొమైన్లను విస్తరించటం, కంటెంట్‎ను జనరేట్ చేయడం , కోడింగ్ అసిస్టెంట్, బుక్ సమ్మరీలను అందించటం ఇలా.. ఏ సమాధానాలైనా చాట్‌జీపీటీ అందిస్తోంది. ఈ AI చాట్‌బాట్‌కు మల్టీటాస్కింగ్‌ చేయగల కెపాసిటీ ఈ యాప్‎కి ఉండటంతో, నెటిజన్లు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.



Updated : 26 July 2023 9:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top