Home > టెక్నాలజీ > పైసల్ వస్తలెవ్.. పోటీ పెరుగుతోంది.. దుకాణం మూసేసే పరిస్థితొచ్చింది

పైసల్ వస్తలెవ్.. పోటీ పెరుగుతోంది.. దుకాణం మూసేసే పరిస్థితొచ్చింది

పైసల్ వస్తలెవ్.. పోటీ పెరుగుతోంది.. దుకాణం మూసేసే పరిస్థితొచ్చింది
X

చాట్ జీపీటీకి కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక నష్టాల్లో కూరుకుని ఇబ్బందులు పడుతోంది. ఖర్చులు మించిపోవడంతో ఆర్థిక భారం తలపై పడుతోంది. చాట్ జీపీటీ యాజమాన్యం ఓపెన్ ఏఐ సంస్థ ఆదాయం పెరగక కష్టాల్లో నిలుస్తోంది. చాట్ జీపీటీ నిర్వహణకు రోజుకు సగటున రూ. 5.80 కోట్లు ఖర్చవుతున్నాయి. దానికితోడు ఓపెన్ ఏఐ సంస్థ ఆదాయం పెరగకపోగా.. నెల నెలకు తగ్గుముఖం పడుతోంది. జూన్ లో చాట్ జీపీటీని 170 కోట్ల మంది వాడగా.. జులై నెల నాటికి 150 కోట్లకు తగ్గింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు జీపీటీ 3.5, జీపీటీ-4 కమర్షియల్ వెర్షన్లను విడుదల చేసినా.. మెరుగైన ఫలితాలు రావడం లేదు.

ఈ సంస్థ కంపెనీలను ఓపెన్ సోర్స్ టెక్నాలజీతో రూపొందించారు. దీంతో ఈ టెక్నాలజీని వేరే కంపెనీలు కాపీ కొట్టి, తమ అవసరాలకు తగ్గట్లు తయారుచేసుకుటున్నారు. కాగా, ఈ కారణాలే చాట్ జీపీటీ ఆర్థిక నష్టాలకు కారణం అంటున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టినప్పటికీ ఓపెన్ ఏఐ రాత మారడం లేదు. అంతేకాకుండా చాట్ జీపీటీకి పోటీగా బింజ్, బార్డ్, ఎలన్ మస్క్ ట్రూత్ జీపీటీ వచ్చిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ తట్టుకుని ఎలా నిలబడుతుంది, చాట్ జీపీటీని మెరుగుపరచడానికి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.




Updated : 13 Aug 2023 5:03 PM IST
Tags:    
Next Story
Share it
Top