Home > టెక్నాలజీ > మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..

మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..

మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..
X

ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోయాయి. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ క్రైమ్ పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా డేటా కూడా చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్, సిమ్ కార్డ్, బ్యాంక్ వివరాలు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మన పేరుతో కొత్త సిమ్ కార్డులను తీసుకొని నేరాలకు పాల్పడే అవకావం ఉంది. ఈ విధంగా చేయడం మనకు అనవసర తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తాజాగా విజయవాడలో ఒకే వ్యక్తి పేరిట 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు కృత్రిమ మేధస్సు ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఈ సిమ్‌లన్నింటినీ టెలికాం అధికారులు బ్లాక్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఈనేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తన రూల్స్ ను అప్డేట్ చేసింది. ఆంక్షలు ప్రకారం ఒక వినియోగదారు పేరు మీద కేవలం 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రీ వెరిఫికేషన్‎కు ఆదేశిస్తారు.దీంతో ఎవరిపేరు మీదు ఎన్ని సిమ్‌లో ఉన్నాయో తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి టెలికాం కంపెనీ https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడమే కాకుండా, మొబైల్ చోరీకి గురైనా, పోయినా కూడా ఆ నంబర్‌ను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇలా చేయండి..

* మొదట సంచార్ సాథీ అధికారిక వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/ ఓపెన్ చేయాలి

* తర్వా రెండు ఆప్షన్స్ కనబడతాయి వాటిలో నో మొబైల్ నంబర్ కనెక్షన్ (TAFCOP)పై క్లిక్ చేయాలి

* కొత్త పేజీ ఓపెన్ అయ్యాక 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి

* క్యాప్చా కోడ్‌ను నమోదు చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి

ఓటీపీని నమోదు చేయగానే మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో తెలుస్తోంది. మీ ప్రమేయం లేకుండా తీసుకున్న నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

Updated : 21 Aug 2023 10:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top